ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు వరుసగా ఒకరి తర్వాత ఒకరు లగ్జరీ కార్లను కొనుగోలు చేస్తూనే ఉన్నారు.ఇటీవల టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu ) ఏ సెలబ్రిటీ దగ్గరా లేని గోల్డ్ కలర్ రేంజ్ రోవర్ కార్ కొన్న విషయం తెలిసిందే.తన రేంజ్‌కి తగ్గట్టుగా ఈ రేంజ్ రోవర్‌ని ఏకంగా రూ.5.4 కోట్లు పెట్టి కొనుగోలు చేశారట మహేష్.చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ తదితరుల దగ్గర రేంజ్ రోవర్ ఉన్నా గోల్డ్ కలర్ SV ( Gold color SV )ఉంది మాత్రం కేవలం మహేష్ దగ్గరే.
ఇది ఇలా ఉంటే గజగా స్టార్ హీరోయిన్ యామీ గౌతమ్( Yami Gautham ) కూడా ఖరీదైన లగ్జరీ కార్ ని కొనుగోలు చేసింది.యామీ తాజాగా లగ్జీరియస్ బీఎండబ్ల్యూ ఎక్స్7 కొనుగోలు చేసింది.
ఈ విషయాన్ని కార్లు విక్రయించే డీలర్షిప్ సంస్థ సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది.ఈ సందర్భంగా తమ బ్రాండ్ న్యూ కార్‌తో యామీ తన భర్త ఆదిత్య కలిసున్న ఒక స్టైలిష్ ఫోటోని షేర్ చేసింది.యామీ దగ్గరున్న వాటిలో ఈ బీఎండబ్ల్యూనే( BMW ) ఖరీదైన కారని తెలుస్తోంది.ఈ కారు కాస్ట్ రూ.1.24 కోట్లని సమాచారం.ఇప్పటికే ఆమె గ్యారేజీలో ఆడి ఏ4, ఆడి క్యూ7 కార్స్ ఉన్నాయి.ఇది ఖరీదైన మూడో కార్.అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో సెలబ్రిటీలు అభిమానులు ఆ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.ఇకపోతే యామీ గౌతమ్ విషయానికి వస్తే.
యామీ తెలుగు, హిందీతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం, పంజాబీ భాషల్లో నటించింది.2021లో ఉరి సినిమా దర్శకుడు ఆదిత్య ధర్ని( Aditya Dharni ) ప్రేమించి పెళ్లి చేసుకుంది.ప్రస్తుతం అక్షయ్ కుమార్, పంకజ్ త్రిపాఠిల OMG సీక్వెల్ OMG 2తో పాటు ధూమ్ ధామ్ అనే సినిమాలో నటిస్తోంది.కాగా ఈ ధూమ్ ధామ్ సినిమాకి దర్శక నిర్మాత ఆమె భర్త ఆదిత్యనే.
ఈమె సినిమాలతో పాటుగా ఎన్నో రకాల బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరించిన విషయం తెలిసిందే.మరి ముఖ్యంగా ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్ తో బాగా పాపులారిటీని సంపాదించుకుంది యామి గౌతమ్.