అలాంటి పాత్రలకు సైతం ఓకే చెబుతున్న నిత్యామీనన్.. ఆఫర్లు తగ్గడంతో ఇలా చేశారా?

తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ హీరోయిన్ నిత్యా మీనన్( Nithya Menen ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.నిత్యా మీనన్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

 Nitya-menon-guest-role-nithin-thammudu-movie, Nithya Menon, Guest Role, Tollywoo-TeluguStop.com

మొదట అలా మొదలైంది సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే, మళ్లీ ఇది రాని రోజు, భీమ్లా నాయక్ లాంటి సినిమాలలో నటించి మెప్పించింది.వీటితో పాటుగా గీతా గోవిందం సన్నాఫ్ సత్యమూర్తి లాంటి సినిమాలలో హీరో హీరోయిన్ లకు ఫ్రెండ్ క్యారెక్టర్ లో నటించింది.

Telugu Guest Role, Nithin Thammudu, Nithyamenen, Nithya Menon, Sapthami Gowda, T

అలా ఈ ముద్దుగుమ్మ కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళ సినిమాలలో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.కాగా ప్రస్తుతం తమిళంలో కాదలిక్క నేరమిల్లయ్, డియర్‌ ఎక్సెస్‌ సినిమాలలో నటిస్తోంది నిత్యామీనన్.తమిళ సినిమాలు తెలుగులో కూడా విడుదల కానున్నాయి.అయితే ఆమె నేరుగా తెలుగు సినిమా అంగీకరించి దాదాపు రెండేళ్లు అవుతోంది.దీంతో తెలుగు సినిమా పరిస్థితి ఏంటి అన్న ప్రశ్న వైరల్ గా మారింది.ఈ ప్రశ్నకు ఆమె తెలుగు సినిమా అంగీకరించింది అనే కామెంట్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి.

Telugu Guest Role, Nithin Thammudu, Nithyamenen, Nithya Menon, Sapthami Gowda, T

నితిన్‌ హీరోగా వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న తమ్ముడు సినిమా( Nithin Thammudu )లో అతిథి పాత్రకు నిత్యామీనన్ ఓకే చేసినట్టు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.కాగా గతంలో నితిన్, నిత్యా మీనన్‌ ఇష్క్, గుండె జారీ గల్లంతయ్యిందే లాంటి సినిమాలలో నటించిన విషయం తెలిసిందే.ఈ రెండు సినిమాలు విడుదల అయ్యి మంచి విజయం సాధించాయి.ఇక నితిన్ హీరోగా నటిస్తున్న తమ్ముడు సినిమాలో సప్తమి గౌడ ( Sapthami Gowda )హీరోయిన్గా నటిస్తుండగా సీనియర్ హీరోయిన్ లయ కూడా కీలకపాత్రలో నటిస్తున్నారు.

ఇక నిత్యామీనన్ అతిధి పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.అయితే ఈ మధ్యకాలంలో నిత్యామీనన్ ఇలా కేవలం అతిధి పాత్రలకు మాత్రమే ఓకే చెబుతుండడంతో ఈమెకు అవకాశాలు రావడం లేదేమో అందుకే ఇలా గెస్ట్ పాత్రలకు ఓకే చెబుతున్నారు అంటూ పలువురు కామెంట్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube