30 ఇయర్స్ పృథ్వీరాజ్ కు భారీ షాక్.. నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ తో ఇబ్బందేనా?

తెలుగు సినీ ప్రేక్షకులకు నటుడు పృథ్వీరాజ్( Prudhvi Raj ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.తెలుగులో ఎన్నో సినిమాలలో నటించి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు పృథ్వీరాజ్.

 Non-bailable-arrest-warrant-to-pridhvi-raj, Arrest Warrant, Pridhvi Raj, Tollywo-TeluguStop.com

కమెడియన్ గా విలన్ గా నటుడిగా మంచి మంచి పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు పృథ్వీరాజ్.ముఖ్యంగా 30 ఇయర్స్ ఇండస్ట్రీ అనే ఒకే ఒక్క డైలాగ్ తో భారీగా ఫేమస్ అయ్యారు.

ఈ డైలాగ్ తర్వాత ఆయన అసలు పేరుకు బదులు చాలామంది 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ అనే పేరుతో పిలవడం మొదలుపెట్టారు.

Telugu Warrant, Pridhvi Raj, Prudhvi Raj, Tollywood-Movie

ఆ సంగతి పక్కన పెడితే పృథ్వీరాజ్ ఇప్పుడు పెద్ద చిక్కుల్లో పడ్డారు.ఆయనకి విజయవాడ ఫ్యామిలీ కోర్టు నాన్‌ బెయిలబుల్‌ అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేసింది.భార్య శ్రీలక్ష్మికి మనోవర్తి చెల్లించే విషయంలో ఉదాసీనంగా ఉన్న కారణంగా కోర్టుకు పృథ్వీకి ఈ అరెస్ట్‌ వారెంట్‌ ను జారీ అయింది.

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడానికి చెందిన బలిరెడ్డి పృథ్వీరాజ్‌కి 84 లో వివాహమైంది.వీరికి ఒక కుమారుడు, కుమార్తె కూడా ఉన్నారు.అయితే వివాదాల కారణంగా భార్యా భర్తలు విడిగానే ఉంటున్నారు.శ్రీలక్ష్మి( Sri Lakshmi ) తన పిల్లలతో కలిసి పుట్టింట్లోనే ఉంటోంది.

Telugu Warrant, Pridhvi Raj, Prudhvi Raj, Tollywood-Movie

2017లో ఆమె కోర్టును ఆశ్రయించింది.భర్త నుంచి తనకు నెలకు ఎనిమిది లక్షలు భరణం ఇప్పించాలని ఆమె కోరింది.సినిమాలు, టీవీ సీరియల్స్‌ చేస్తూ తన భర్త నెలకు రూ.30 లక్షల వరకు సంపాదిస్తున్నారని, తనకు భరణం ఇప్పించాలని 2017లో కేసు దాఖలైంది.ఈ కేసును విచారించిన కోర్టు 2022లో శ్రీలక్ష్మీకి అనుకూలంగా తీర్పునిచ్చింది.అప్పటివరకు ఆమెకు అయిన కోర్టు ఖర్చులతో సహా ప్రతినెలా 10వ తేదీ లోపు రూ.8 లక్షలు చెల్లించాలని పృథ్వీని ఆదేశించింది కోర్టు.అయితే కోర్టు ఆదేశాలను ఖాతరు చేయని పృథ్వీపై నాన్‌బెయిలబుల్‌ అరెస్ట్‌ వారెంట్‌ జారీ అయింది.

కుటుంబంతోనే కాకుండా రాజకీయంగా కూడా పలు వివాదాల్లో ఇరుక్కున్న పృథ్వీకి ఇది పెద్ద షాక్‌ అనే చెప్పాలి.మరి ఈ కేసు ఇంకా ఎంత దూరం వెళ్తుందో చూడాలి మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube