పవన్ కాళ్లపై పడి ఆశీర్వాదం తీసుకున్న లోకేష్.. వైరల్ అవుతున్న వీడియో!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు( Chandrababu Naidu ) ప్రమాణస్వీకారం చేశారు జూన్ 12వ తేదీ ఈయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగా పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.వీరితోపాటు మరి కొంతమంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే.

 Nara Lokesh Touches Pawan Kalyan Feets At Oath Ceremony , Nara Lokesh, Pawan Kal-TeluguStop.com

ఇక ఇందులో భాగంగా నారా లోకేష్ ( Nara Lokesh) సైతం మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.ఇక ఈ వేడుకకు ఇటు నారా నందమూరి ఫ్యామిలీలతో పాటు మెగా కుటుంబ సభ్యులకు కూడా హాజరై సందడి చేశారు.

Telugu Ap, Chandrababu, Deputy Cm, Lokesh, Oath Ceremony, Pawan Kalyan-Movie

ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి అనంతరం వేదికపై ఉన్నటువంటి తన అన్నయ్య చిరంజీవికి ( Chiranjeevi ) పాదాభివందనాలు చేశారు.ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.అయితే తాజగా మరొక వీడియో వెలుగులోకి వచ్చింది ఇందులో భాగంగా లోకేష్ పవన్ కళ్యాణ్ కాళ్లపై పడి నమస్కారాలు చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది.

Telugu Ap, Chandrababu, Deputy Cm, Lokesh, Oath Ceremony, Pawan Kalyan-Movie

నారా లోకేష్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత వేదికపై ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కాళ్లకు నమస్కారం చేయబోయారు.అయితే పవన్ కళ్యాణ్ వద్దని చెప్పినప్పటికీ పవన్ కళ్యాణ్ తనకు సోదరులతో సమానమని భావించి నారా లోకేష్ ఆయన కాళ్లకు నమస్కారం చేశారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇలా లోకేష్ పవన్ కళ్యాణ్ కు పాదాభివందనం చేయడంతో మెగా ఫాన్స్ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఈ వీడియోని వైరల్ చేస్తున్నారు.మరికొందరు ఈ వీడియో పై నెగిటివ్ గా కామెంట్లు చేస్తున్నారు.

ఇక పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా పదవీ బాధ్యతలు అందుకోబోతున్నారనీ, డిప్యూటీ సీఎంతో పాటు మరో శాఖకు మంత్రిగా కూడా ఈయన బాధ్యతలు తీసుకోబోతున్నారు అయితే ఈయన ఏ శాఖ బాధ్యతలు తీసుకోబోతున్నారనేది త్వరలోనే తెలియనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube