2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి నరసాపురం ఎంపీగా గెలిచిన రఘురామకృష్ణం రాజు కొంతకాలానికి ఆ పార్టీ అధినేత జగన్ తో విభేదించడం, ఆయనపై విమర్శలు చేయడం , వైసిపి ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపడం వంటివి చోటుచేసకున్నాయి.అంతే స్థాయిలో వైసీపీ నుంచి కూడా రియాక్షన్ ను చూశారు.రఘురామ కృష్ణంరాజు ను అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టడంతో పాటు, ఏపీలో అడుగు పెట్టకుండా ఢిల్లీకే ఆయన పరిమితం అయ్యేలా చేశారు.2024 ఎన్నికలకు ముందు టిడిపిలో చేరి ఉండి ఎమ్మెల్యేగా పోటీ చేసి రఘురామ విజయం సాధించారు.ఇదిలా ఉంటే తాజాగా జగన్ వ్యవహారంపై రఘురామకృష్ణంరాజు( Raghu Rama Krishna Raju ) స్పందించారు.ఈ మేరకు భీమవరంలో మీడియాతో మాట్లాడిన రఘురామకృష్ణంరాజు మంచో చెడో చేయాల్సింది చేసి వెళ్ళపోయాడు.
ఇక ఆయన గురించి పట్టించుకోవడం సమయం వృధా అంటూ జగన్( YS jagan ) పై కామెంట్ చేశారు. ప్రస్తుతం ప్రజలు తమకు బాధ్యత ఇచ్చారని, వాటిని నిర్వర్తించాల్సి ఉందన్నారు జగన్ ను ప్రజలు కూడా పట్టించుకోవడంలేదని, దానికి సాక్ష్యంగానే అతి తక్కువ సీట్లు ఆ పార్టీకి వచ్చాయని రఘురామ అన్నారు. ప్రజల దృష్టి ఇకపై తమ మీద ఉంటుందని , తనపై జరిగిన కస్టోడియల్ టార్చర్ విషయంలో చట్టప్రకారమే అందరికీ శిక్షపడేలా చేస్తానని రఘురామ క్లారిటీ ఇచ్చారు .కక్షలు తీర్చుకునేందుకు జనం తమకు అధికారం ఇవ్వలేదని , బాధ్యత ఇచ్చారని చంద్రబాబు అన్నారని రఘురామ గుర్తు చేశారు .
చట్టప్రకారం తప్పు చేసిన వాళ్ళని వదిలిపెట్టమని , అందుకే తాను గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేశానని , రెండు రోజుల్లో ఎఫ్ఐఆర్ నమోదవుతుందని అన్నారు.ఇక రఘురామ కు మంత్రి పదవి రాకపోవడం పైన ఆయన స్పందించారు.అన్ని వర్గాల ప్రజలు ఆదరిస్తేనే తమకు అన్ని సీట్లు, ఓట్లు వచ్చాయని, అందులో క్షత్రియుల పాత్ర కూడా ఉందని , క్షత్రియులకు కూడా మంత్రివర్గంలో అవకాశం ఇస్తే బాగుండేదని రఘురామ వ్యాఖ్యానించారు