మగవారికి మద్దతుగా రష్మిక.. ఎంతో ప్రత్యేకం అంటూ కామెంట్స్?

రష్మిక మందన్న ( Rashmika Mandanna ) ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతూ కెరియర్ పరంగా బిజీ అయ్యారు.కేవలం పాన్ ఇండియా సినిమాల్లో మాత్రమే కాకుండా బాలీవుడ్ సినిమాలలో కూడా నటిస్తూ కెరియర్ పట్ల ఎంతో బిజీగా ఉండే రష్మిక సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.

 Rashmika Counter To Netizen Post About Gents ,rashmika ,support Gents , Animal,-TeluguStop.com

ప్రస్తుతం ఈమె పుష్ప 2(Pushpa 2) సినిమాతో పాటు కుబేర వంటి తదితర సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.ఇకపోతే ఎన్టీఆర్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రాబోయే సినిమాల్లో కూడా ఈమె నటించబోతున్నారని సమాచారం.

ఈ విధంగా వరుస పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్న రష్మిక తాజాగా సోషల్ మీడియా వేదికగా మగవారిని సపోర్ట్ చేస్తూ చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.మగవారిని కించపరుస్తూ ఒక నెటిజన్ చేసిన ట్వీట్ కి కౌంటర్ ఇస్తూ ఈమె చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.ఇందులో భాగంగా మగాడిని నమ్మడం కంటే భయంకరమైనది మరొకటి లేదనే విషయాన్ని గుర్తు పెట్టుకోండి అంటూ రష్మిక యానిమల్ ( Animal ) సినిమా సీన్  షేర్ చేశారు.

ఇక ఈ పోస్టుకు రష్మిక స్పందిస్తూ.మూర్ఖుడిని నమ్మడం ఒక భయానకం.మగాళ్లలో చాలామంది మంచి వ్యక్తులు కూడా ఉన్నారు.

అలాంటి వారిని నమ్మడం ఎంతో ప్రత్యేకం అంటూ ఈ సందర్భంగా మగవారిని సపోర్ట్ చేస్తూ రష్మిక చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇక రష్మిక చేసిన ఈ పోస్ట్ పై పలువురు వివిధ రకాలుగా స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.

ఇక రష్మిక త్వరలోనే పుష్ప 2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.ఈ సినిమా ఆగస్టు 15వ తేదీ విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube