తెలుగుదేశం అధినేత ఏపీ సీఎం చంద్రబాబు మెగా డీఎస్సీ( AP CM Chandrababu )ఫైల్ పై తొలి సంతకం చేశారు.దీంతో టీడీపీ ప్రభుత్వం రాష్ట్రంలో డీఎస్సీ ద్వారా 16,347 టీచర్ పోస్టులను భర్తీ చేయనుంది.
ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ఎన్నికల ప్రచారంలో గెలిస్తే ముఖ్యమంత్రిగా డీఎస్సీ ( DSC )ఫైల్ పై తొలి సంతకం చేస్తానని మాట ఇచ్చారు.ఇచ్చిన మాట ప్రకారం గెలిచినా అనంతరం సచివాలయంలో ప్రవేశించాక ముఖ్యమంత్రిగా డీఎస్సీ ఫైల్ పై సీఎం చంద్రబాబు తొలి సంతకం చేయడం జరిగింది.
దీంతో త్వరలో ఆయా పోస్టులకు నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది.అనంతరం ల్యాండ్ టైటిలింగ్( Land Titling Act ) యాక్ట్ రద్దు, ₹4000 రూపాయలకు పింఛన్ పెంపు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణన ఫైల్ పై సంతకం చేయడం జరిగింది.
నిన్న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం చంద్రబాబు తన నివాసంలో మంత్రులతో భేటీ అయ్యారు.ఈరోజు ఉదయం తిరుమలలో శ్రీవారిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు.అనంతరం విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.ఆ తరువాత ఉండవల్లి నివాసానికి చేరుకుని అనంతరం అక్కడ నుండి సాయంత్రం సచివాలయానికి ఊరేగింపుగా బయలుదేరారు.చంద్రబాబు కాన్వాయ్ రోడ్డుపైకి వచ్చింది మొదలుకొని సచివాలయం వెళ్లే వరకు దారి పొడవునా అఖండ స్వాగతం పలికారు.చంద్రబాబు వాహనంపై రైతులు, మహిళలు పూల వర్షం కురిపించారు.
సాయంత్రం 4:41 నిమిషాలకు సచివాలయంలో మొదటి బ్లాక్ లో ఉన్న ఛాంబర్ లో ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి.మొదట మెగా డీఎస్సీ ఫైల్ పై ఆ తర్వాత మిగతా నాలుగు అంశాలపై సంతకాలు చేయటం జరిగింది.