దేవర సినిమా ప్రీపోన్ కావడం అన్ని కోట్ల లాభమా.. ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ), కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న దేవర అక్టోబర్ 10వ తేదీన దసరా కానుకగా రిలీజ్ కావాల్సి ఉండగా ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రీపోన్ అయింది.సెప్టెంబర్ నెల 27వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుందని జరిగిన ప్రచారం ఎట్టకేలకు నిజం కావడం గమనార్హం.

 Devara Cinema Prepone Profits Details Here Goes Viral In Social Media , Devara-TeluguStop.com

సోషల్ మీడియా వేదికగా ఇందుకు సంబంధించిన పోస్టర్ రిలీజైంది.జనతా గ్యారేజ్ తర్వాత ఈ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా ఇదే కావడం గమనార్హం.

Telugu Devara, Janhvi Kapoor, Ntr, Koratala Siva, Saif Ali Khan, Tollywood-Movie

అయితే ప్రీపోన్ కావడం వల్ల ఈ సినిమా మేకర్స్ కు ఏకంగా 50 కోట్ల రూపాయల లాభమని తెలుస్తోంది.సోలో సినిమాగా విడుదల కావడం వల్ల ఇంత మొత్తం ఎక్కువ కలెక్షన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి.విస్మరణకు గురైన తీర ప్రాంతానికి సంబంధించిన కథతో ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం.దేవర సినిమాలో జాన్వీ కపూర్( Janhvi Kapoor ) హీరోయిన్ గా నటిస్తుండగా సైఫ్ అలీ ఖాన్( Saif Ali Khan) విలన్ గా నటిస్తున్నారు.

దేవర సినిమా బడ్జెట్ 300 కోట్ల రూపాయలు కాగా ఈ సినిమాకు బిజినెస్ సైతం భారీ స్థాయిలో జరుగుతోందని సమాచారం అందుతోంది.

Telugu Devara, Janhvi Kapoor, Ntr, Koratala Siva, Saif Ali Khan, Tollywood-Movie

దేవర సినిమా ( Devara movie )తారక్ ట్రిపుల్ హ్యాట్రిక్ కు నాంది పలుకుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. దేవర సినిమా రిలీజ్ డేట్ గురించి క్లారిటీ రావడంతో ఇతర సినిమాలు సైతం ఈ డేట్ కు అనుగుణంగా తమ సినిమాల రిలీజ్ డేట్లను మార్చుకుంటున్నాయని సమాచారం అందుతోంది.దేవర సినిమా ఫస్ట్ పార్ట్ హిట్ గా నిలిస్తే సెకండ్ పార్ట్ గురించి పూర్తిస్థాయిలో క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది.

దేవర సినిమా వేరే లెవెల్ లో ఉండబోతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.దేవర సినిమా హిట్టై భారీ కలెక్షన్లు సాధిస్తే పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా పేరు మారుమ్రోగే అవకాశాలు అయితే ఉంటాయి.

సినిమా సినిమాకు క్రేజ్ పెంచుకుంటున్న ఎన్టీఆర్ దేవర సినిమాతో సోలోగా 1000 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధిస్తారేమో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube