జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడిన కేసీఆర్ అందుకు తొలి అడుగుగా పక్క రాష్ట్రాల్లో పాగా వేయాలని చూసారు.ముఖ్యంగా మరో తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో అడుగు మోపి అక్కడ ఉన్న రాజకీయశూన్యతను తనకు అనుకూలంగా మార్చుకోవాలని భావించారు.
అందుకే ఏపీకి కీలక అంశాలైన ప్రత్యేక హోదా, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, రైల్వే కారిడార్ వంటి అంశాలను ఎత్తుకున్నారు.ఏపీలో కీలక సామాజిక వర్గమైన కాపు సామాజిక వర్గం నుంచి తోట చంద్రశేఖర్ అధ్యక్షుడిగా నియమించారు.
అయితే ఆయన ఎన్ని ప్రయత్నాలు చేసినా తెలంగాణ ఉద్యమ సమయం లో ఆంధ్రులను తీవ్రం గా అవమానించిన కేసీఆర్ పట్ల సహజం గానే వ్యతిరేక ధోరణితో ఉండే ఏపీలో ఆయన పార్టీకి అనుకున్నంత బజ్ రాలేదు .కనీసం మహారాష్ట్రలో పార్టీలోకి వచ్చిన వలసల స్థాయిలో కూడా ఆంధ్రప్రదేశ్లో ఆ పార్టీకి ఆదరణ దక్కలేదు. జెడి లక్ష్మీనారాయణ లాంటి కీలక నేత పార్టీ లో చెరతారని వార్తలు వచ్చి ఆ దిశగా కొన్ని పరిణామాలు జరిగినప్పటికీ కూడా ఆయన ఎందుకో వెనక్కి తగ్గారు.
ఇలాంటి సమయంలో తమకున్న తక్కువ సమయాన్ని వనరులను ఆంధ్రప్రదేశ్ పై కేంద్రీకరించడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని భావించిన గులాబీ బాస్ ఏపీ విషయంలో వెనక్కి తగినట్లు కనిపిస్తుంది.
ఇటీవల రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసిన పార్టీలో జాబితాలో బారాస పార్టీకి స్థానం దక్కలేదు.ఏదైనా ఒక పార్టీ ఒక రాష్ట్ర ఎన్నికలలో పోటీ చేయాలంటే తప్పనిసరిగా ఆ రాష్ట్ర ఎన్నికల కమిషన్ వద్ద నమోదు చేసుకోవాల్సి ఉంటుంది .బారాసా కనీసం పార్టీ నమోదు చేసుకో లేదంటే ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల పట్ల వారికి అంత ఆసక్తి లేనట్లుగానే ప్రచారం అవుతుంది

తెలంగాణలో ఎన్నికలకు తక్కువ సమయం ఉండటం, కేంద్రంలో భాజాపాకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు కూటమి కట్టడంతో జాతీయ రాజకీయాల లో ఇప్పుడు బారసా పాత్రకు అవకాసం లేదని లేదని భావించిన కేసీఆర్ ముందు రాష్ట్ర రాజకీయాలకు దృష్టి పెట్టే ఉద్దేశంతో ఉన్నారని అందుకే ఆంధ్రప్రదేశ్ పై ఫోకస్ తగ్గించారని ప్రచారం జరుగుతుంది .జరుగుతున్న పరిణామాలు కూడా అందుకు బలం చేకూరుస్తున్నాయి .