బీసీసీఐ( BCCI ) ప్రస్తుతం కొత్త చీఫ్ సెలెక్టర్ ను నియమించే పనిలో నిమగ్నం అయింది.చీఫ్ సెలెక్టర్ గా కొనసాగిన చేతన్ శర్మ ఓ చానల్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ లో దొరికిపోవడం వల్ల పదవికి రాజీనామా చేశాడు.
అప్పటినుంచి శివ సుందర్ దాస్( Shiva Sundar Das ) తాత్కాలికంగా చీఫ్ సెలెక్టర్ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.అయితే భారత క్రికెట్ గతిని మార్చగలిగే సమర్ధుడైన కొత్త చీఫ్ సెలెక్టర్ ఎంతైనా అవసరం ఉందని, ఈ పదవికి వీరేంద్ర సెహ్వాగ్ అయితే బాగుంటుంది అని బీసీసీఐ భావిస్తోంది.
బీసీసీఐ ఉన్నత అధికారులు కూడా ఈ పదవి విషయంలో వీరేంద్ర సెహ్వాగ్ ( Virender Sehwag )కలిశారు.కొన్ని ఆర్థికపరమైన అంశాలకు సంబంధించి స్పష్టత అనేది లేకపోవడంతో ఈ వ్యవహారం ఇంకా కొలిక్కి రాలేదు.

ప్రస్తుతం భారత జట్టును( Indian team ) ఎంపిక చేసే కమిటీకి చీఫ్ సెలెక్టర్ ఎవరూ లేరు.ఇందుకోసం బీసీసీఐ భారత జట్టు మాజీ క్రికెటర్లలో పలువురు పేర్లు ప్రతిపాదనకి వచ్చినప్పటికీ వీరేంద్ర సెహ్వాగ్ మాత్రమే సమర్థంగా భారత జట్టు గతిని మార్చగలడని అభిప్రాయపడుతుంది.కొత్త చీఫ్ సెలెక్టర్ గా వీరేంద్ర సెహ్వాగ్ బాధ్యతలు స్వీకరిస్తే ఏడాదికి కోటి రూపాయల వేతనం బీసీసీఐ అందిస్తుంది.మాజీ క్రికెటర్లకు ఈ వేతనం తక్కువ అని అనిపించడంతో మాజీ క్రికెటర్లు ఈ పోస్ట్ పట్ల ఆసక్తి చూపడం లేదు.
బహుశా వీరేంద్ర సెహ్వాగ్ కూడా జీతం తక్కువగా ఉందని ఉద్దేశంతో ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.

గతంలో కూడా భారత జట్టు హెడ్ కోచ్ పదవికి దరఖాస్తు చేయాలని బీసీసీఐ వీరేంద్ర సెహ్వాగ్ ను కోరింది.అప్పుడు సెహ్వాగ్ ఆసక్తి చూపించకపోవడంతో ఆ పదవి అనిల్ కుంబ్లే చేతికి వెళ్ళింది.కానీ ప్రస్తుతం సెహ్వాగ్ ను కొత్త చీఫ్ సెలెక్టర్ పోస్టుకు దరఖాస్తు చేయమనడానికి ప్రధాన కారణం ఈ ఏడాది చివరలో వరల్డ్ కప్ ఉండడం.
వరల్డ్ కప్ ఆడే జట్టు ఎంపిక చేసే అవకాశం సెలక్షన్ కమిటీ చీఫ్ గా సెహ్వాగ్ కు దక్కుతుంది.కాబట్టి వన్డే వరల్డ్ కప్ ను దృష్టిలో పెట్టుకొని వీరేంద్ర సెహ్వాగ్ చీఫ్ సెలెక్టర్ పదవిని స్వీకరిస్తాడా.
లేదా.అనే విషయంలో ఉత్కంఠ నెలకొంది.