రీసెంట్ సమయం లో మన అందరినీ శోకసంద్రం లోకి నెట్టేసిన వార్త రాకేష్ మాస్టర్( Rakesh master Death ) అకాల మరణం.నిన్న మొన్నటి వరకు ఆయన ఉత్తరాంధ్ర లో ఒక ప్రత్యేక ప్రోగ్రాం చేస్తూ తన తోటి యూట్యూబ్ సెలబ్రిటీస్ తో మంచి గా ఎంజాయ్ చేసిన ఆయన, వైజాగ్ నుండి హైదరాబాద్ కి తిరిగి రాగానే తీవ్రమైన అస్వస్థతకు గురి అయ్యాడు.
ఆ తర్వాత ఆయనని వెంటనే గాంధీ హాస్పిటల్ కి తరలించి అక్కడ అత్యవసర చికిత్స అందించగా, డాక్టర్లు అప్పటికే అతను బ్రతకలేదని చెప్పేసారు.మూడు గంటల పాటు చావుతో పోరాడిన ఆయన మొన్న సాయంత్రం 5 గంటలకు తన తుది శ్వాసని విడిచిపెట్టాడు.
ఆయన మరణ వార్తని ఇప్పటికీ నమ్మడం కష్టమే, ఎందుకంటే ఆయన సోషల్ మీడియా ఆడియన్స్ కి అంతలా కనెక్ట్ అయ్యాడు.ఎప్పుడు చలాకీగా నవ్వుతు నవ్విస్తూ తిరుగులేని ఎంటెర్టైమెంట్ ని గత రెండు మూడు సంవత్సరాల నుండి ఇస్తున్నాడు.

ఇక ఆయన చనిపోయిన తర్వాత రాకేష్ మాస్టర్ గురించి ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు సోషల్ మీడియా లో బయటపడ్డాయి.గతం లో ఆయన అనేక ఇంటర్వూస్ లో ఇండస్ట్రీ లో కొంతమంది ప్రముఖులు క్రేజీ ప్రాజెక్ట్స్ లో నాకు అవకాశం వచ్చినప్పుడు, చివరి నిమిషం లో అడ్డుపడి నన్ను తప్పించేశారని, అందువల్ల ఇండస్ట్రీ లో నేను అనుకున్నంత స్థాయికి రాలేకపోయానని చెప్పుకుంటూ చాలా బాధపడ్డాడు.అలా ఆయన మిస్ అయినా ప్రాజెక్ట్స్ లో పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన ‘జల్సా'( Jalsa Movie ) సినిమా కూడా ఉంది.ఈ చిత్రం లో సూపర్ హిట్ సాంగ్ గా నిల్చిన ‘గాల్లో తేలినట్టుందే.
గుండె పేలినట్టుందే’ అనే పాట రాకేష్ మాస్టర్ కంపోజ్ చెయ్యాల్సిన పాట.కానీ ఆయనంటే పడని వాళ్ళు త్రివిక్రమ్( Trivikram ) కి లేనిపోనివి చెప్పి, అతను సాంగ్ అనుకున్న సమయం లో తియ్యలేదు సార్, మీ ఆర్టిస్ట్స్ డేట్స్ మిస్ అవుతాయి అంటూ భయపెట్టి ఆ ప్రాజెక్ట్ దక్కనివ్వకుండా చేశారట.

దాంతో ఆ క్రేజీ ప్రాజెక్ట్ చెయ్యి జారిపోయింది, అలా రాకేష్ మాస్టర్ కి మిస్ అయినా ప్రాజెక్ట్స్ లిస్ట్ చాలా పెద్దదే.గతం లో ఆయన రవితేజ తో ‘మనసిచ్చాను’, వేణు తో ‘చిరునవ్వుతో’, మహేష్ బాబు తో ‘యువరాజు’, నాగార్జున తో ‘సీతారారామ రాజు’ మరియు రామ్ పోతినేని తో ‘దేవదాసు’ వంటి చిత్రాలు చేసాడు.ఈ సినిమాల్లో ఆయన కంపోజ్ చేసిన పాటలన్నీ పెద్ద హిట్ అయ్యాయి.కానీ బ్యాడ్ లక్ కారణంగా రాకేష్ మాస్టర్ పాపులర్ కాలేకపోయాడు.అలా ఆయన టాలెంట్ కి తగ్గ గుర్తింపు దక్కక, సినిమానే నమ్ముకున్న ఆయనకీ సినిమాల్లో అవకాశాలు లేకపోవడం తో డబ్బు సంపాదన లేక, ఎన్నో ఆర్థిక ఇబ్బందులకు గురై ఆకలితో పస్తులున్న రోజులు కూడా ఉన్నాయి.తన శిష్యరికం లో పెరిగిన శేఖర్ మాస్టర్( Sekhar Master ) మరియు జానీ మాస్టర్ వంటి వారు ఇండస్ట్రీ లో ఎవ్వరూ ఊహించని స్థాయికి చేరుకున్నా, ఏనాడూ కూడా వాళ్ళని ఒక్క రూపాయి సహాయం కూడా అడగలేదట, అలా ఆత్మవిశ్వాసం తో బ్రతికి, చివరి క్షణం వరకు తన సొంత కష్టం మీదనే బ్రతికాడు రాకేష్ మాస్టర్.