సోషల్ మీడియా ( Social media )వచ్చిన తర్వాత ఎవరైనా సరే సెలబ్రెటీ అవ్వడానికి మంచి ఫ్లాట్‌ఫామ్ దొరుకుతుంది.ఎవరైనా సరే రాత్రికి రాత్రి సోషల్ మీడియా ద్వారా పాపులర్ అవ్వొచ్చు.
ఒక్క నైట్ లోనే స్టార్‌డమ్‌ని సోషల్ మీడియాలో తెచ్చుకోవచ్చు.కొంతమంది రకరకాల వినూత్న పనులతో సోషల్ మీడియాలో పాపులర్ అవుతూ ఉంటారు.
కొంతమంది రకరకాల విన్యాసాలు చేస్తూ, మరికొంతమంది కామెడీ చేస్తూ యూజర్లను ఆకట్టుకుంటూ ఉంటారు.ఇక మరికొంతమంది తమలోని డ్యాన్స్, సింగింగ్ టాలెంట్‌ను బయటపెట్టి క్రేజ్ సంపాదించుకుంటూ ఉంటారు.
సాధారణ వ్యక్తులు కూడా సోషల్ మీడియాలో తమలోని ప్రతిభను బయటపెట్టి సెలబ్రెటీగా మారిపోతున్నారు.ఇలా సోషల్ మీడియా ద్వారా సెలబ్రెటీలుగా మారినవారు చాలామంది ఉన్నారు.సోషల్ మీడియాలో క్రేజ్ సంపాదించుకుని ఆ తర్వాత సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకున్నారు.ఇప్పుడు ఒక సాధారణ మామిడి పండ్ల వ్యాపారి కూడా ఒక పాటతో గుర్తింపు పొందాడు.
<img src=" https://telugustop.com/wp-content/uploads/2023/06/Song-mangoselling-boy-viral-latest-news-viral-social-media-viral.jpg”/>
పాప్ స్టార్ షకీరా వాకా వాకా సాంగ్( Shakira ) ఎంత పాపులర్ అనేది మనందరికీ తెలిసిందే.ఇప్పుడు ఈ పాటలోని పదాలను మార్చుతూ తనదైన శైలితో ఒక సాధారణ మామిడి పండ్ల వ్యాపారి పాడాడు.ఈ వ్యక్తి పాకిస్తాన్ కు చెందిన మామిడి పండ్ల వ్యాపారిగా తెలుస్తోంది.వాకా వాకా పాట( Waka Waka )ను మార్చి పాడుతూ కస్టమర్లను ఆకట్టుకుంటున్నాడు.పాకిస్తాన్ లోని అటాక్ నగరంలో రోడ్డుపై తోపుడు బండి మీద ఈ వ్యకి మామిడి పండ్లు విక్రయిస్తున్నాడు.కస్టమర్లను ఆకర్షించేందుకు ఇలా పాటను విభిన్నంగా పాడుతున్నాడు.
దీంతో అతడి టాలెంట్‌ను చూసి చాలామంది పొగడ్తలు కురిపిస్తున్నారు.హంజా చౌదరి ఆఫిషియల్ అనే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఈ వీడియోను షేర్ చేశారు.
దీంతో క్రియేటివ్ ఉపయోగించి బిజినెస్ చేస్తున్నాడని కామెంట్స్ చేస్తున్నారు.