రాకేష్ మాస్టర్ ను జోకర్‌ గా మార్చింది వారే.. మృతికి కారణం కూడా వాళ్లే

టాలీవుడ్‌ సీనియర్‌ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్( Choreographer Rakesh Master ) మృతి చెందారు.తీవ్ర అనారోగ్య సమస్యతో ఆయన మృతి చెందినట్లుగా వైద్యులు దృవీకరించారు.

 They Are The Cause Of Rakesh Master's Death,rakesh Master,choreographer,tollywoo-TeluguStop.com

విపరీతమైన ఆల్కహాల్ సేవించడం వల్లే రాకేష్ మాస్టర్ మృతి చెందాడు అనేది చాలా మంది మాట.వైజాగ్ లో షూటింగ్ ముగించుకుని హైదరాబాద్‌ వచ్చిన తర్వాత రాకేష్ మాస్టర్‌ కోలుకోలేదు.తీవ్రంగా మధ్యం సేవించడం వల్లే అనారోగ్య పరిస్థితులకు గురి అయ్యారు అంటూ కొందరు మాట్లాడుకుంటున్నారు.1500 పాటలకు కొరియోగ్రఫీ అందించిన రాకేష్ మాస్టర్‌ ను గత కొన్నాళ్లుగా కొందరు కావాలని జోకర్ గా మార్చారు.సోషల్‌ మీడియాలో ఆయన యొక్క ప్రవర్తన చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగించింది.

Telugu Choreographer, Rakesh Master, Telugu, Tollywood, Youtube-Movie

యూట్యూబ్‌( Youtube ) కు చెందిన కొందరు రాకేష్ మాస్టర్ ముందు మందు బాటిల్స్ పెట్టి ఇంటర్వ్యూలు తీసుకున్నారు.వివాదాస్పదం అవ్వాలని కొందరు తాగించి మరీ ఇంటర్వ్యూలు తీసుకున్నారు.కావాలని బాగా తాగించి బూతులు తిట్టించేవారు.

అలా రాకేష్ మాస్టర్ ను జోకర్‌ గా మార్చేశారు.గొప్ప కొరియోగ్రఫర్‌ అయిన ఆయన ఎంతో మంది శిష్యులను ఇండస్ట్రీకి అందించాడు.

అలాంటి రాకేష్ మాస్టర్ మృతి చెందిన సమయంలో ఉన్న పరిస్థితిని చూసి అంతా కూడా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.మరీ ఇంత దారుణంగా పరిస్థితి ఉందా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

బాగా తాగడం వల్లే రాకేష్ మాస్టర్ మృతి( Rakesh Master Death ) చెందాడు అనేది ప్రతి ఒక్కరి మాట.

Telugu Choreographer, Rakesh Master, Telugu, Tollywood, Youtube-Movie

ఆ తాగుడు కు అలవాటు చేసింది యూట్యూబ్‌ ఛానల్ వారు అంటూ అంతా కూడా ఆరోపిస్తున్నారు.మొత్తానికి రాకేష్ మాస్టర్ జీవితం ను కొందరు నాశనం చేశారు అంటూ విమర్శలు వ్యక్తం చేస్తున్నారు.రాకేష్ మాస్టర్ కి తాగుడు అలవాటు విపరీతంగా చేసిన వారు ఆయన కు మరో పెళ్లి చేయాలని కూడా చూశారు.

ఆయన ఒంటరిగా ఉంటున్న కారణంగా యూట్యూబ్ కు చెందిన ఒక యాంకర్ ఆయనకు తోడుగా ఒక లేడీని తీసుకు వచ్చి ఇంట్లో ఉంచిన విషయం తెల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube