లభ్యమైన మూడు వేల ఏళ్ల నాటి కత్తి.. ఎలా ఉందో చూశారా..?

అప్పుడప్పుడు పురాతనశాఖ తవ్వకాల్లో ఏళ్ల నాటి వస్తువులు, శిలాఫలకాలు, విగ్రహలు బయటపడుతూ ఉంటారు.రాజులు, అప్పట్లో జీవించిన మనుషులు వాడిన వస్తువులను తవ్వకాల్లో పురాతనశాఖ( Department of Antiquities ) వెలికితీస్తూ ఉంటుంది.

 Thousand Year Old Sword In Germany Bavarian , Have You Seen , Special, Special-TeluguStop.com

అలాగే అప్పుడప్పుడు కొన్నిచోట్ల అనుకోకుండా పురాతనకాలం నాటి విగ్రహాలు బయటపడుతూ ఉంటాయి.వీటిని మ్యూజియంలో పెట్టి అందరూ చూడటానికి ప్రదర్శిస్తూ ఉంటారు.

దీంతో వీటిని చూసేందుకు చాలామంది సందర్శకులు వస్తూ ఉంటారు.

Telugu Bavaria, Bavarian, Germany, Sword, Specialist, Thousand-Telugu NRI

తాజాగా ఏకంగా మూడు వేల ఏళ్ల నాటి కత్తి లభ్యమైంది. జర్మనీ( Germany )లో ఇది వెలుగులోకి వచ్చింది.జర్మనీలోని పురావస్తు శాఖ శాస్త్రవేత్తలు 3 వేల ఏళ్ల నాటి కత్తిని కనిపెట్టారు.

ఇప్పటికీ ఈ కత్తి కాంతివంతంగా మెరిసిపోతుంది.అప్పటి కత్తి ఇప్పటికీ మెరుస్తుండటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

అయితే ఈ కత్తి కంచు యుగపు నాటి కాలంలో భద్రపరిచినట్లు పురావస్తు సైంటిస్టులు గుర్తించారు.బవేరియన్ స్టేట్ ఆఫీసర్ ఫర్ మాన్యుమెంట్ ప్రొటెక్షన్ జూన్ 14న దీనికి సంబంధించి ఒక ప్రకటన విడుదల చేసింది.

Telugu Bavaria, Bavarian, Germany, Sword, Specialist, Thousand-Telugu NRI

బవేరియన్( Bavarian ) పట్టణంలోని నోర్డింలింగెన్‌లోని శ్మశాన వాటిలో ఈ కత్తిని కనుగొన్నట్లు తెలుస్తోంది.ఒక స్త్రీ, పురుషుడు సమాధుల మధ్యలో ఈ కత్తి లభ్యమైంది.ఇది కాంస్య ఫుల్ హిల్డ్ కత్తుల రకమని సైంటిస్టులు చెబుతున్నారు.అష్టభుజి పట్టీ పూర్తిగా కాంస్యంతో తయారుచేయగా.ఈ ఖడ్గాన్ని 14వ శతాబ్ధం బీసీ చివరినాటికి సంబంధించినదిగా గుర్తించారు.నైపుణ్యం కలిగిన శిల్పులు మాత్రమే ఇలాంటి కత్తులను తయారుచేగలరని పురావస్తు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.14వ బీసీ కాలంలో ఖడ్డ ఆవిష్కరణలు చాలా అరుదు అని, మధ్య కాంస్య యుగం సమాధులు సహస్రాబ్ధాలుగా దోచుకోబడ్డాయని అంటున్నారు.మొత్తానికి మూడు వేల ఏళ్ల క్రితం నాటి ఈ కత్తి ఇప్పుడు బయటపడటం చూసి ఆశ్చర్యపోతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube