వైఫైతో పనిచేసే సీసీ కెమెరాలు.. మీ ఇంటికి Z+ సెక్యూరిటీ

ప్రస్తుతం దొంగల భయం ఎక్కువైంది.అర్ధరాత్రే కాదు.

 Wi Fi Enabled Cctv Cameras Z Security For Your Home-TeluguStop.com

పట్టపగలు కూడా దొంగలు రెచ్చిపోతున్నారు.ఇళ్లల్లోకి చొరబడి అందినకాడికి దోచేస్తున్నారు.

అలాగే రోడ్లపై పోయేవారిని బెదిరించి కూడా దొంగతనాలకు పాల్పడుతున్నారు.దీంతో బయటకు వెళ్లినప్పుడు, రద్దీగా ఉండే ప్రాంతాల్లో సంచరించేటప్పుడు జాగ్రతగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

అయితే సెక్యూరిటీ కోసం ఇప్పుడు ప్రతిఒక్కరూ సీసీ కెమెరాలు( CC cameras ) అనేవి తప్పనిసరిగా ఏర్పాటు చేసుకుంటున్నారు.

అయితే వైఫైతో నడిచే స్మార్ట్ కెమెరా( Smart camera ) ఇప్పుడు రూ.2,245కే కొనుగోలు చేయవచ్చు.ఇందులో 350 డిగ్రీల వీక్షణతో పాటు మోషన్ డిటెక్షన్, టూవే కమ్యూనికేషన్, పాన్ టిల్ట్ ఆప్షన్ల లాంటివి ఉంటాయి.

ఇక కెంట్ కక్యామ్ క్యామ్ ఐ హోమ్ క్యామ్( Kent kacam cam i home cam ) 360 సెక్యూరిటీ కెమెరాను ప్రముఖ ఈ కామర్స్ ఫ్లాట్‌ఫామ్ ఫ్లిఫ్‌కార్ట్ నుంచి కొనుగోలు చేయవచ్చు.దీని ధర రూ.2,599గా ఉంది.1440 గంటల వరకు రికార్డ్ టైమ్ తో పాటు నైట్ విజన్ ఫీచర్, 360 వ్య, ఏఐ మెషన్ డిటెక్షన్, వైఫై కనెక్టివిటీ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

ఇక రియల్ మీ స్మార్ట్ క్యామ్( Real Me Smart Cam ) 360 డిగ్రీలు సీసీ కెమెరాను ఆ కంపెనీ వెబ్ సైట్ నుంచి కొనుగోలు చేయవచ్చు.దీని ధర రూ.2,999గా ఉంటుంది.ఈ సెక్యూరిటీ కెమెరా 360 డిగ్రీ వ్యూతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోషన్ డిటెక్టర్, 1080పీ వీడియో రికార్డింగ్.

టూవే కమ్యూనికేషన్ వంటి ఫీచర్లు ఉంటాయి.ఇక టీపీ లింక్ టాపో 360 డిగ్రీల 2ఎంపీ 1080పీ పుల్ హెచ్డీ కెమెరా ధర రూ.3 వేలు ఉంటుంది.కెమెరా ఆలక్స్ సపోర్ట్, నైట్ విజన్, సౌండ్ అండ్ లైట్ అలారం ఆప్షన్లు ఇందులో ఉంటాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube