ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ( Allu Arjun ) హీరోగా లెక్కల మాస్టారు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియన్ మూవీ ”పుష్ప ది రూల్”.ఇందులో రష్మిక మందన్న అల్లు అర్జున్ కు జోడీగా నటిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ గ్రాండ్ నిర్మాణ విలువలతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
పుష్ప రాజ్ రాకకోసం పాన్ ఇండియా వ్యాప్తంగా ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
ఇటీవలే అల్లు అర్జున్ బర్త్ డే కానుకగా గ్లింప్స్, ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేయగా మాసివ్ రెస్పాన్స్ అందుకుంది.
ఈ అప్డేట్ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా ఒక్కసారిగా అంచనాలు డబల్ అయ్యాయి.పుష్ప సినిమాకు( Pushpa 2 ) సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా అప్పటి కంటే డబల్ బడ్జెట్ తో నిర్మితం అవుతుంది.
అంచనాలు అయితే పది రెట్లు పెరిగి పోయాయి.
ఇదిలా ఉండగా ఈ సినిమా నుండి ఇప్పుడు అదిరిపోయే వార్త బయటకు వచ్చింది.ఈ సినిమా ప్రజెంట్ శరవేగంగా షూటింగ్ జరుపు కుంటున్న విషయం తెలిసిందే.మరి ఆ షూటింగ్ ఎక్కడ జరుగుతుంది అనే అప్డేట్ వచ్చింది.
గోదావరి జిల్లాల్లో( Godavari Districts ) పుష్ప 2 షూటింగ్ యమ జోరుగా సాగుతున్నట్టు ఒక వీడియో వైరల్ అవుతుంది.
ఈ వీడియో ప్రకారం అక్కడ ప్రజెంట్ ఎర్ర చందనం స్మగ్లింగ్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్టు తెలుస్తుంది.ఎర్రచందనం స్మగ్లింగ్ ఆధారంగానే ఈ సినిమా కథ ముడిపడింది.మరి ఆ కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్న చిన్న వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
ఇక పుష్ప 1 ను మించిన అగ్ర కాస్టింగ్ ను సుకుమార్ యాడ్ చేసుకుంటూ పోతున్నాడు.చూడాలి ఈసారి రిలీజ్ తర్వాత ఈసారి ఎన్ని సంచలనాలు క్రియేట్ చేస్తుందో.
ఈ ఏడాది డిసెంబర్ లోనే రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.