ఇటీవలే కాలంలో ఎటువంటి వివరాలు తెలియకపోయినా వివిధ రకాల మోసాలతో కోట్లు కొట్టేసిన దొంగతనాల గురించి వింటూనే ఉన్నాం.ఇక అన్ని వివరాలు తెలిసి లక్షల మొత్తంలో డబ్బు ఉందంటే కచ్చితంగా డబ్బు కొట్టేయడానికి చాలామంది కేటుగాళ్లు ప్రయత్నిస్తారు.ఇలాంటి కోవలోనే హైదరాబాద్ నగరంలో( Hyderabad ) ఏకంగా రూ.50 లక్షల రూపాయలను ఇద్దరు కొరియర్ బాయ్స్( Courier Boys ) చాకచక్యంగా కొట్టేయడం సంచలనంగా మారింది.హవాలా( Hawala ) రూపంలో తరలిస్తున్న డబ్బును క్షణాల్లో మాయం చేసేశారు.అసలు ఇంత పెద్ద మొత్తంలో డబ్బు ఎలా కొట్టేశారో అనే వివరాలు పూర్తిగా తెలుసుకుందాం.
బంజారా హిల్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.బంజారాహిల్స్ లో శైలేందర్ సింగ్ అనే వ్యాపారి నివాసం ఉంటున్నాడు.

అయితే అమన్ ప్రీత్ సింగ్ అనే వ్యక్తి శైలేందర్ సింగ్ కు ఫోన్ చేసి రూ.50 లక్షల రూపాయలను అంగాడియా కొరియర్ కు చెందిన వ్యక్తి ద్వారా పంపించాలని కోరాడు.ఆ కొరియర్ కు సంబంధించిన వ్యక్తి పేరు శర్మ అని అతని వద్ద రూ.20 నోటు తీసుకొని, అతని చేతి రూ.50 లక్షలు ఇవ్వాలని తెలిపాడు.ఆ రూ.20 నోటు నెంబర్ 96 M 279764 అని తెలిపాడు.ఇంతవరకు బాగానే ఉంది.కానీ శర్మ అనే వ్యక్తి తాను వెళ్లకుండా శైలేందర్ సింగ్ కు ఫోన్ చేసి తాను బిజీగా ఉన్నానని రావడం కుదరదు అంటూ సంతోష్ అనే వ్యక్తి రూ.20 నోటు తీసుకువస్తాడని,

ఆ నోటు నెంబర్ పరిశీలించిన తర్వాత రూ.50 లక్షలు ఇవ్వాలని తెలిపాడు.అందుకు శైలేందర్ శర్మ అంగీకరించాడు.ఇక సంతోష్ రూ.20 నోటు ఇచ్చి రూ.50 లక్షలు తీసుకొని వెళ్ళిపోయాడు.కానీ ఆ డబ్బు అమన్ ప్రీత్ సింగ్ కు అందలేదు.
శర్మ అనే వ్యక్తికి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది.ఆ తర్వాత శైలేందర్ సింగ్, సంతోష్ కు ఫోన్ చేసిన స్విచ్ ఆఫ్ రావడంతో అమన్ ప్రీత్ సింగ్, శైలేందర్ సింగ్ లు తాము మోసపోయానని బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించారు.
పోలీసులు 406,420 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.







