ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తం ఇప్పుడు శ్రీ రామ జపం చేస్తున్న సంగతి తెలిసిందే.ప్రభాస్ వంటి పాన్ ఇండియన్ సూపర్ స్టార్ రామాయణం చేస్తే ఎలా ఉంటుందని మనం అప్పట్లో ఊహించుకున్నామో, అలా ఉంది ‘ఆదిపురుష్’ ( Adipurush )మూవీ బాక్స్ ఆఫీస్ ప్రభంజనం.
ఇప్పటి వరకు ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్స్ మరియు పాటలు ఈ చిత్రం పై అప్పటి వరకు ఉన్న అంచనాలను పదింతలు చేసింది.శ్రీ రాముడిగా ప్రభాస్ లుక్స్ పై కొంత విమర్శకులు నెగటివ్ కామెంట్స్ చేసినా, ఆడియన్స్ ప్రభాస్( Prabhas ) ని శ్రీ రాముడిగా అంగీకరించారు.
అందుకే ఈ చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ అద్భుతంగా ఉన్నాయి.తెలుగు రాష్ట్రాల్లో పూర్తి స్థాయిలో ఇంకా అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం అవ్వలేదు కానీ, హిందీ లో ఇప్పటికే ప్రధాన నగరాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించారు.
కేవలం నార్త్ ఇండియా లోనే ఈ సినిమాకి మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్స్ 5 కోట్ల రూపాయలకు జరిగిందని అంచనా.

ఇక ఈ చిత్రానికి సంబంధించిన ఆంధ్ర ప్రదేశ్( Andhra Pradesh ) మరియు తెలంగాణ అడ్వాన్స్ బుకింగ్స్ రేపు పూర్తి స్థాయిలో ప్రారంభం కానున్నాయి.తెలంగాణ ప్రాంతం లో ఈ సినిమాకి మూడు రోజుల వరకు సింగల్ స్క్రీన్స్ లో 50 రూపాయలకు పైగా టికెట్ హైక్ చేసుకోవచ్చని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.ఇక ఆంధ్ర ప్రదేశ్ కి సంబంధించిన టికెట్ రేట్స్ హైక్ రావాల్సి ఉంది.
దీనిపై ప్రభుత్వం నుండి ఇంకా క్లారిటీ రాలేదు.ఇకపోతే ఈ సినిమాకి బుక్ మై షో లో ఇంట్రెస్ట్స్ రోజు రోజు కి భారీగా పెరిగిపోతున్నాయి.
ఇప్పటి వరకు ఈ సినిమా కి 8 లక్షల 70 వేల ఇంట్రెస్ట్స్ ఓట్లు లభించాయి.సినిమా విడుదల సమయానికి అది 10 లక్షల ఓట్లకు చేరుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు ట్రేడ్ పండితులు.
ఇప్పటి వరకు టాలీవుడ్ లో విడుదలకు ముందు అత్యధిక ఓటింగ్ ని దక్కించుకున్న చిత్రం రాజమౌళి తెరకెక్కించిన #RRR.

#RRR చిత్రానికి విడుదల ముందు రోజు వరకు బుక్ మై షో లో 14 లక్షల ఓట్లు లభించాయి, ఆ తర్వాతి స్థానం లో ‘ఆదిపురుష్’ చిత్రం నిల్చింది.ఇక మూడవ స్థానం లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమా , 6 లక్షల 50 వేల ఓట్లను దక్కించుకోగా, భీమ్లా నాయక్ చిత్రానికి 5 లక్షల 75 వేల ఓట్లు, మహేష్ బాబు సర్కారు వారి పాట చిత్రానికి నాలుగు లక్షల 50 వేల ఓట్లు దక్కాయి.ఇప్పుడు ఆదిపురుష్ మూవీ చిత్రాన్ని రికార్డు ఓటింగ్స్ ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘బ్రో ది అవతార్’ చిత్రం బ్రేక్ చేస్తుందో లేదో చూడాలి.
ఇక ఆదిపురుష్ చిత్రం విషయానికి వస్తే, ప్రభాస్ ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి ఇంటర్వ్యూస్ ఇవ్వబోవడం లేదట.ఆదిపురుష్ విడుదల అయ్యేవరకు ఆయన అమెరికా లో ఉంటాడట.