ఈ మద్య తెలంగాణ రాజకీయాల్లో కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి( Minister Mallareddy ) తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.బిఆర్‌ఎస్ పార్టీలో( BRS Party ) కీలక నేతగా ఉన్న మల్లారెడ్డి తనదైన సెటైరికల్ వ్యాఖ్యలతో అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటారు.
” పాలమ్మిన.పూలమ్మిన.” అంటూ తన గత జీవితాన్ని ఆయన చెప్పిన విధానం ఈ మద్య సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే.ఇదిలా ఉంచితే ప్రత్యర్థి నేతలపై ఘాటుగా సెటైరికల్ గా విమర్శలు గుప్పించే మల్లారెడ్డికి తన సొంత నియోజిక వర్గం మల్కాజ్ గిరి( Malkajgiri ) వ్యతిరేకత ఎదురవుతోందా అంటే అవుననే సమాధానం తెలంగాణ పోలిటికల్ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఈప్పటికే భూ కబ్జాలు, అవినీతి ఆరోపణలు మల్లారెడ్డి పై తేరచు వినిపిస్తూనే ఉంటాయి.ఆ మద్య ఈడీ రైడ్ లను కూడా ఎదుర్కొన్న సంగతి విధితమే.దాంతో స్వలాభం కోసం చూసుకునే మల్లారెడ్డి నియోజిక వర్గ సమస్యలను గాలికి వదిలేశారనే వాదన ప్రజల్లో గట్టిగా వినిపిస్తోంది.దీంతో వచ్చే ఎన్నికల్లో మల్లారెడ్డికి మల్కాజ్ గిరిలో గట్టి ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉందనే అభిప్రాయం చాలమందిలో ఉంది.
ఇక ఇదే నియోజిక వర్గం నుంచి తిన్మార్ మల్లన్న కూడా పోటీ చేస్తుండడంతో ఆయన నుంచి మల్లారెడ్డికి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది.

ప్రస్తుతం కేసిఆర్ పాలనపై తిన్మార్ మల్లన చేస్తున్న వ్యాఖ్యలు, ఆరోపణలు ఎప్పటికప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గానే నిలుస్తున్నాయి.ఈ నేపథ్యంలో మల్లారెడ్డిపై ఉన్న అవినీతి ఆరోపణలపై తిన్మార్ మల్లన్న ఎన్నికల ముందు మరింత గట్టిగా ప్రస్తావించే అవకాశం ఉంది.ఇదిలా ఉంచితే పార్టీలో కూడా మల్లారెడ్డి వైఖరి పై ఇతర నేతలకు పొసగడం లేదనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి.
దాంతో ఈసారి మల్లారెడ్డికి మల్కాజ్ గిరి సీటు వస్తుందా లేదా ఇంకేదైన నియోజిక వర్గం నుంచి పోటీ చేస్తే అవకాశం ఉందా ? అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి.మొత్తానికి ఇవన్నీ కూడా మల్లారెడ్డి పై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది.
మరి వచ్చే ఏన్నికల్లో మల్లారెడ్డి ఫెట్ ఎలా ఉంటుందో చూడాలి.