మాస్ కా దాస్ విశ్వక్ సేన్ రీసెంట్ గా ధంకీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ప్రస్తుతం విశ్వక్ సేన్ 11వ సినిమా కృష్ణ చైతన్య డైరెక్షన్ లో రాబోతుంది.
ఈ సినిమా తర్వాత తన డైరెక్షన్ లో వచ్చిన రెండు సినిమాలకు సీక్వెల్స్ చేస్తానని అంటున్నాడు విశ్వక్ సేన్.తన డైరెక్షన్ లో వచ్చిన ఫలక్ నుమా దాస్ కి కొన్నాళ్లుగా సీక్వెల్ ప్లానింగ్ లో ఉన్నా అది కుదరలేదు.
ఆ సినిమా సీక్వెల్ కచ్చితంగా ఉంటుందని చెప్పాడు విశ్వక్ సేన్.ఇక మరోపక్క రీసెంట్ గా వచ్చిన ధంకీ సినిమాకు కూడా సీక్వెల్ ఉంటుందని చెప్పాడు.
ఫలక్ నుమా దాస్, దాస్ కా ధంకీ ( Das Ka Dhamki )ఈ సినిమాలకు సీక్వెల్స్ చేస్తే విశ్వక్ సేన్ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యే ఛాన్స్ ఉంటుంది.ఇప్పటికే తనకంటూ ఒక మాస్ ఇమేజ్ ఏర్పరచుకున్న విశ్వక్ సేన్ రాబోతున్న సినిమాలతో మరింత రచ్చ చేయాలని ఫిక్స్ అయ్యాడు.విశ్వక్ సేన్ సినిమాల ప్లానింగ్ మిగతా హీరోలకు షాక్ ఇస్తుంది.అనతి కాలంలోనే యువ హీరోల్లో తనకంటూ ఒక ముద్ర వేసుకున్న విశ్వక్ సేన్ కచ్చితంగా ఫ్యూచర్ స్టార్ అవుతాడనడంలో డౌట్ లేదని చెప్పొచ్చు.