మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు.దర్యాప్తునకు సంబంధం లేకుండా కొంతమంది ప్రభావితం చేస్తున్నారని మండిపడ్డారు.
స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోకుండా ప్రభావితం చేస్తున్నారని సజ్జల ఆరోపించారు.అంతేకాకుండా న్యాయమూర్తులకు సైతం దురుద్దేశాలు ఆపాదిస్తున్నారన్నారు.
కొందరు జడ్జిల నియామకంపైనా కామెంట్స్ చేస్తున్నారన్న సజ్జల సీబీఐ ఏం చేస్తుందనేది ముందుగానే ఎలా చెప్పగలుగుతున్నారని ప్రశ్నించారు.ఇవన్నీ వ్యక్తిత్వ హననమేనని తెలిపారు.
జగన్ ను దెబ్బకొట్టడమే అజెండాగా పెట్టుకున్నారని చెప్పారు.ప్రజాక్షేత్రంలో ఎదుర్కొనే సత్తా లేక ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.