ఇటీవలే కాలంలో యువతీయువకులు ప్రేమించుకోవడం అనేది సర్వసాధారణం.అయితే కొంద మంది ప్రేమికుల ప్రేమ పెళ్లి వరకు వెళితే.
మరికొందరి ప్రేమ మధ్యలోనే ముగుస్తుంది.ఇక ప్రేమించి పెళ్లి చేసుకున్నాక కూడా మనస్పర్ధలు వచ్చి విడిపోయిన వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది.
ఇలాంటి కోవలోనే ఇద్దరు వ్యక్తులు ప్రేమించుకుని, పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకొని మనస్పర్ధలు కారణంగా విడిపోయారు.అయితే భార్యపై ఆ భర్త పగను పెంచుకొని చివరికి దారుణంగా హత్య చేసి తాను కూడా ఆత్మహత్య ప్రయత్నం చేశాడు.
ఈ ఘటన అనకాపల్లి జిల్లా అచ్యుతపురంలో చోటుచేసుకుంది.అసలు ఏమి జరిగిందో చూద్దాం.
వివరాల్లోకెళితే.గాజువాక బీసీ సెంటర్ కు చెందిన శ్రీనివాస్ ( Srinivas )కు, అగంపూడి కి చెందిన మహాలక్ష్మి( Mahalakshmi ) కు ఇంటర్ చదివేటప్పుడు పరిచయం ఏర్పడింది.కొంతకాలానికి వీరి పరిచయం కాస్త ప్రేమగా మారింది.కానీ ఇరు కుటుంబ సభ్యులు వీరి ప్రేమను అంగీకరించకపోవడంతో ఎదిరించి మరీ వివాహం చేసుకున్నారు.
అయితే వివాహం జరిగి ఏడాది కూడా కాకముందే వీరి మధ్య విభేదాలు మొదలయ్యాయి.దీంతో 2021లో మ్యూచువల్ డైవర్స్ ( Mutual divers )కు దరఖాస్తు చేసుకున్నారు.
కానీ శ్రీనివాస్ కోర్టుకు సక్రమంగా హాజరు కాకపోవడంతో విడాకుల ప్రక్రియ ఆలస్యమైంది.మహాలక్ష్మి తన తల్లిదండ్రుల వద్ద ఉంటూ ఉద్యోగం చేసుకుంటూ సంతోషంగా ఉండడం చూసి శ్రీనివాస్ పగ పెంచుకున్నాడు.
ప్రతిరోజు మద్యం సేవిస్తూ మద్యానికి బానిస అయ్యాడు.అప్పుడప్పుడు మహాలక్ష్మిని వేధించేవాడు.
దీంతో మహాలక్ష్మి తల్లిదండ్రులు గాజువాక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు.
అయినా కూడా శ్రీనివాసులు మార్పు రాలేదు.ఎలాగైనా భార్య మహాలక్ష్మిని చంపేయాలని మంచివాడిగా మారినట్లు నటించాడు.
ఇక ప్లాన్ లో భాగంగా సోమవారం అచ్యుతాపురం( Achyutapuram ) లాడ్జిలో తన పేరు మీద ఒక రూమ్ బుక్ చేసుకున్నాడు.రూమ్ లో బిర్యానీ తో పాటు ప్లాన్లో భాగంగా మత్తు ఇంజక్షన్లు, కత్తి ను దాచి ఉంచాడు.తర్వాత మహాలక్ష్మి కి ఫోన్ చేసి తాను మంచివాడిగా మారానంటూ నమ్మకపు మాటలు చెప్పి లాడ్జికి రావాలని పిలిచాడు.మహాలక్ష్మి లాడ్జికి వెళ్ళాక దారుణంగా హత్య చేసి, తాను కూడా మత్తు ఇంజక్షన్లతో ఆత్మహత్య ప్రయత్నం చేశాడు.
రూమ్ లోకి వెళ్ళిన వారు చాలాసేపటికి రాలేదని సిబ్బంది రూమ్ తలుపులు తెరవగా ఇద్దరు అపస్మారక స్థితిలో ఉండడం చూసి పోలీసులకు సమాచారం అందించారు.పోలీసులు సంఘటన స్థలానికి చేరుకునే లోగా మహాలక్ష్మి మృతి చెందడం, శ్రీనివాస్ అపస్మారక స్థితిలో ఉండడం జరిగింది.పోలీసులు ఇద్దరిని ఆసుపత్రికి తీసుకువెళ్లగా మహాలక్ష్మి చనిపోయిందని, ఆమె శరీరంపై 20 వరకు కత్తిగాట్లు ఉన్నాయని వైద్యులు తెలిపారు.శ్రీనివాస్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.