యాదాద్రి భువనగిరి జిల్లా: చౌటుప్పల్ మున్సిపాలిటీలో వసూళ్లు చేస్తున్న ఇంటి పన్నులపై అధికార బీఆర్ఎస్ పార్టీ నాయకులే( BRS leaders ) అసహనం వ్యక్తం చేశారు.రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా చౌటుప్పల్ మున్సిపాలిటీ( Choutuppal )లో పన్నులు విధిస్తున్నారని,వెంటనే ప్రజలపై పన్నుల భారం తగ్గించాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ మున్సిపాలిటీ అధ్యక్షులు ముత్యాల ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు,కార్యకర్తలు ఆదివారం ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ని హైదరాబాద్ లోని తన నివాసంలో కలిసి వినతిపత్రం అందజేశారు.
అంతేకాకుండా ద్విచక్ర వాహనదారులకు పోలీసులు( Police ) విధిస్తున్న ఫైన్ల మీద స్పందించాలని వారు కోరారు.సొంత పార్టీ నాయకులే ప్రభుత్వ విధానాలపై విసిగిపోయి వినతిపత్రాలు ఇస్తున్నారని,ప్రజలను ఈ విధంగా ఇబ్బందులకు గురి చేస్తున్న బీఆర్ఎస్ కు రానున్న రోజుల్లో ఓటమి తప్పదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.