మళ్లీ పెళ్లి ( malli pelli )అనే సినిమాతో నరేష్( Naresh ) ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా నిలిచాడు ఈ సినిమా విడుదలై థియేటర్లో మిక్స్డ్ టాక్ తో ముందుకెళ్తోంది అయితే ఈ సందర్భంలో సూపర్ స్టార్ హీరో కృష్ణ ( hero krishna )తమ్ముడు ఆదిశేషగిరి రావు ( Adiseshagiri Rao )ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేయడం విశేషం.హీరో కృష్ణ చనిపోయిన సమయంలో ఆయన తమ్ముడు ఆదిశేషగిరిరావు చివరి వరకు ఆ కుటుంబంతోనే ఉన్నాడు.
ఆదిశేషగిరి రావు నిర్మాతగా పలు సినిమాలలో నిర్మించడంతో పాటు కృష్ణకు సంబంధించిన అన్ని వ్యవహారాలను ఆయన దగ్గరుండి చూసుకునేవాడు.ఈ ఇంటర్వ్యూ లో కృష్ణ చనిపోయిన సమయంలో జరిగిన కొన్ని సంఘటనలు, అలాగే రమ్య నరేష్ వ్యవహారం, ఆస్తుల పంపకాలపై వివరాలను తెలియచేశాడు.
కృష్ణ కన్నుమూసిన సమయంలో అతని అనాధ శవంగా ఇంట్లో వదిలేసి అందరూ వెళ్లిపోయారు అంటూ రమ్య రఘుపతి ఒక వీడియో విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే ఈ వీడియో గురించి స్పందిస్తూ ఆదిశేషగిరిరావు ఆమె చెబుతున్నవన్నీ కూడా అబద్ధాలే అని చలిగా ఉండి ఎక్కువగా అలసిపోయారు కాబట్టి కాస్త విశ్రాంతి తీసుకోమని చెప్పడంతో అందరూ వెళ్లిపోయారే తప్ప ఆ రోజు రాత్రి తన కొడుకు మరియు మేనల్లుడు కూడా అక్కడే ఉన్నారని, వారు పక్కకు వెళ్ళిన సమయంలో ఆమె వీడియో చూసి అలా మీడియాకు లీక్ చేసింది అంటూ చెప్పుకొచ్చాడు.ఇక నరేష్ రమ్య రఘుపతి విషయంపై స్పందిస్తూ అతనితో మాకు సంబంధం ఏంటి మా అన్నయ్య రెండవ భార్యకు పుట్టిన కొడుకు అయితే మా ఇంటి వారసుడు అవుతాడా నరేష్ అనే వాడితో మాకు ఎలాంటి సంబంధం లేదు అంటూ కుండ బద్దలు కొట్టాడు.
ఇక నరేష్ రమ్య గొడవలపై స్పందిస్తూ మాకు సంబంధం లేని వ్యక్తుల ఇంట్లో ఏం జరిగితే మాకేంటి అది వారి వ్యక్తిగత విషయం మాకు సంబంధించిన అంతవరకు మాకు నరేష్ కు సంబంధం లేదు అంటూ తెలియజేశారు అంతేకాదు కృష్ణ గారి ఆస్తుల విషయంలో కూడా ఆయన స్పందించారు.విజయ నిర్మలకు సంబంధించిన ఒక రూపాయి కూడా కృష్ణ గారు తీసుకోలేదని అలాగే కృష్ణకు సంబంధించిన డబ్బులు కూడా విజయ నిర్మలకు లేదా ఆమె తరపు వారికి చెంద లేదని కృష్ణ బాగా బ్రతికిన రోజుల్లోనే ఎవరికి వారికి పంపకాలు చేసేసారని తెలిపారు సో ఆస్తుల విషయంలో ఎలాంటి గొడవలు లేవని అందరూ హ్యాపీగానే ఉన్నారు అంటూ తెలియజేశారు
.