టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) మే 20వ తేదీ 40 వ పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్న విషయం మనకు తెలిసిందే.ఇలా ఎన్టీఆర్ నలభైవ యేట అడుగుపెట్టడంతో ఎంతోమంది జ్యోతిష్యులు ఈయన జాతకాన్ని తిరిగేస్తున్నారు.
ఇలా ఈయన జాతకం ఎలా ఉండబోతుంది తన కెరియర్ పై తన జాతకం ఎలా ప్రభావం చూపించబోతుంది అన్న విషయాల గురించి వివరణ ఇస్తున్నారు.ఈ క్రమంలోనే ప్రముఖ జ్యోతిష్యుడు పండిట్ జగన్నాథ్ గురూజీ( Pandit Jagannath Guruji ) ఎన్టీఆర్ జాతకం గురించి వివరించారు.
ఈ సందర్భంగా గురుజి ఎన్టీఆర్ జాతకం గురించి మాట్లాడుతూ ఎన్టీఆర్ జాతకం ప్రకారంఎప్పటికప్పుడు ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకుంటూ అందరి పట్ల నమ్మదగిన వారుగా ఉంటారని తెలియజేశారు.రాబోయే రోజులలో ఈయన సినీ కెరియర్ పట్ల మరింత గౌరవ ప్రతిష్టలను అందుకుంటారని తెలియజేశారు.సినీ కెరియర్ (Cine Career) పరంగా ఈయన మంచి అభివృద్ధి సాధిస్తారని తెలిపారు.అయితే కొన్ని నిర్ణయాలు ఎన్టీఆర్ ను ఇబ్బందులలో పడవేస్తాయని గురూజీ తెలియజేశారు.
ఎన్టీఆర్ తన స్నేహితుల(Friends) కారణంగా ఇబ్బందులు తలెత్తుతాయని స్నేహితుల విషయంలో ఎన్టీఆర్ కాస్త అప్రమత్తంగా ఉండాలని జగన్నాథ్ గురూజీ తెలియజేశారు.ఎన్టీఆర్ జాతకంలో గురు ప్రభావం కూడా ఉంది.దాని వల్ల డబ్బు, కెరీర్ లో బ్యాలెన్స్ ఉంటుంది.కొంత కుజ ప్రభావం కూడా ఉండటం వల్ల స్నేహితుల విషయంలో ఎన్టీఆర్ కాస్త జాగ్రత్తలు తీసుకుంటే అతనికి ఏవి అడ్డు రావని ఈ సందర్భంగా జగన్నాథ్ గురూజీ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
దీంతో ఎన్టీఆర్ అభిమానులు ఇప్పటికే కుటుంబంలో ఎన్టీఆర్ కి జరుగుతున్న అవమానాలు పట్ల కాస్త అసహనం వ్యక్తం చేస్తున్నారు.ఇక ఈ విషయం తెలియడంతో స్నేహితుల పట్ల కూడా ఎన్టీఆర్ అప్రమత్తంగా ఉండాలని అభిమానులు సూచిస్తున్నారు.