ఏంటి నయనతారను( Nayanthara ) డైరెక్టర్ విగ్నేష్ ( Vignesh )డబ్బుల కోసం పెళ్లి చేసుకున్నాడా అంటే అవునంటున్నారు కొందరు జనాలు.కొంతకాలం సహజీవనం చేసిన ఈ జంట ఆ మధ్యనే పెళ్లి చేసుకొని సరోగసి ద్వారా ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చారు.
నయనతార గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు కానీ ఆమె భర్త కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ తెలుగు ప్రేక్షకులకు అంత టచ్ లో లేడని చెప్పాలి.కేవలం నయనతార వల్లే ఈయన తెలుగు ప్రేక్షకులకు చేయమయ్యాడు.
ఇక నయనతార 2003 లో సినీ ఇండస్ట్రీకి అడుగుపెట్టగా.2006లో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయింది.తెలుగుతో పాటు తమిళ, మలయాళ వంటి భాషల్లో కలిపి దాదాపు 30కి పైగా సినిమాల్లో నటించింది.ప్రస్తుతం ఈమె లేడీస్ సూపర్ స్టార్( Lady Super star ) గా ఒక పేరు సంపాదించుకుంది.
ఇక ఈమె హీరోయిన్ గా కంటే వ్యక్తిగత విషయంలో కూడా బాగా హాట్ టాపిక్ గా నిలిచింది.గతంలో ఈమె తమిళ హీరో శింబు, ప్రభుదేవాతో ప్రేమాయణం నడపగా వారితో దిగిన రొమాంటిక్ ఫోటోలు బాగా వైరల్ అయ్యాయి.
అప్పట్లో ఆ ఫోటోలు వార్తలలో బాగా హల్చల్ చేయటంతో ప్రతి ఒక్కరు నయనతారను విమర్శించారు.అయినప్పటికీ కూడా ఆమెకు ఇండస్ట్రీలో గౌరవం తగ్గలేదు.ఏ సినిమాలోనైనా ముందుగా డైరెక్టర్ ఈమెనే రిఫర్ చేసేవాళ్ళు.
అప్పట్లో ఈమె క్రేజ్ అలా ఉండేది.
ఇక ఇప్పుడు కూడా అలాగే నడుస్తుంది కానీ తెలుగులో అంతగా సినిమాలకు కమిట్మెంట్ ఇవ్వటం లేదు.కోలీవుడ్ లో మాత్రం తన భర్త సపోర్ట్ ఎక్కువగా ఉండటం వల్ల వరుస సినిమాలు చేస్తూ పోతుంది.
ఇక పెళ్లి తర్వాత ప్రతి విషయంలోనూ ఆచితూచి ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటుంది.ముఖ్యంగా బికినీ వేసేందుకు కూడా ఒప్పుకోవటం లేదు అని తెలుస్తుంది.
కోట్లు రెమ్యూనరేషన్( Remuniration ) ఆఫర్ చేసిన కూడా రొమాంటిక్ సీన్స్ లో నటించనని గట్టిగా చెప్పేస్తుందట.అంతేకాకుండా కథ నచ్చినప్పటికీ కూడా రెమ్యూనరేషన్ కూడా తగ్గించుకుంటుందట.కాని తన భర్త విగ్నేష్ మాత్రం అలా లేడు అని తెలుస్తుంది.నయనతారకు పూర్తిగా విరుద్ధంగా ఉన్నాడని తెలుస్తుంది.విగ్నేష్ శివన్ దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న కాన్సెప్ట్ ను ఫాలో అవుతాడు.క్రేజ్ ఉన్నప్పుడే నయనతార దగ్గర ఎక్కువ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నాడని తెలుస్తుంది.
అందుకే నయనతార జవాన్ సినిమాకు ఏకంగా 10 కోట్లు డిమాండ్ చేసిందని తెలిసింది.దీంతో విగ్నేష్ శివన్ ఆమెకు ఒక రేట్ ఫిక్స్ చేశాడట.
ఇన్ని కోట్లు అయితేనే రెమ్యూనరేషన్ తీసుకో లేదంటే సినిమా స్కిప్ చేసేయ్ అని గట్టిగా అన్నాడట.అయితే నయనతార మనస్తత్వం అలాంటిది కాదని.
కేవలం డబ్బు కోసమే విగ్నేశ్ ఇలా నయనతారను పెళ్లి చేసుకున్నాడని కొందరు అనుమానాలు పడుతున్నారు.ఇందులో ఎంత నిజాముందో తెలియాలి అంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.