ఎటువంటి అంచనాలు లేకుండా థియేటర్ లోకి విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన చిత్రం బలగం( Balagam movie ).జబర్దస్త్ కమెడియన్ వేణు వండర్స్ ( Venu vanders )దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే.
విడుదలైన మొదటి రోజే సూపర్ హిట్ టాక్ ని అందుకోవడంతో ప్రేక్షకులు థియేటర్లకు బ్రహ్మరథం పట్టారు.కాగా ఈ సినిమా విడుదలైన తర్వాత కొన్ని ఏళ్ల తరబడి కొట్లాటలు పగలతో దూరంగా ఉంటున్న చాలా ఫ్యామిలీలు కలిసినట్లు కూడా వార్తలు వినిపించాయి.
వెండితెర పై సెన్సేషనల్ హిట్ గా నిలిచిన ఈ సినిమా ఇటీవలే బుల్లితెర పై కూడా రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.ఇటీవలె టీవీలో విడుదలైన ఈ సినిమా ఊహించని విధంగా మరో విజయాన్ని సొంతం చేసుకుంది.స్టార్ మా చానల్లో విడుదల చేసిన బలగం సినిమాకు ఏకంగా 14.3 టిఆర్పి( TRP ) వచ్చింది.ఇటీవల కాలంలో బుల్లితెరపై ప్రసారమైన సినిమాల్లో ఇదే అత్యధికం అని చెప్పవచ్చు. హైదరాబాద్ సెగ్మెంట్ లోనైతే ఏకంగా 22 రేటింగ్ తో సంచలనం సృష్టించింది బలగం సినిమా.
ఈ మధ్యకాలంలో కొన్ని సినిమాలు వెండితెరపై సూపర్ హిట్ గా నిలిచినప్పటికీ బుల్లితెరపై మాత్రం అంతగా సక్సెస్ సాధించలేకపోతున్నాయి.అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో టీవీలోకి వచ్చి మరో అరుదైన ఘనతను సాధించింది.బలగం సినిమా సెన్సేషనల్ టీఆర్పీ సాధించింది.వేణు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రియదర్శి కావ్య కళ్యాణ్ రామ్ హీరో హీరోయిన్ లుగ్స్ నటించిన విషయం తెలిసిందే.
మొత్తం మీద వెండితెరపై సూపర్ హిట్ టాక్ ని అందుకున్న బలగం సినిమా బుల్లితెరపై కూడా సూపర్ హిట్ అని అందుకుంది.