బాలీవుడ్ హీరోయిన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నటి పరిణితి చోప్రా( Parineeti Chopra ) గత కొద్ది రోజుల క్రితం ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ చద్దా( Raghav Chadha ) తో ఘనంగా నిశ్చితార్థం ( Engagement ) జరిగిన విషయం మనకు తెలిసింది.ఇలా వీరి నిశ్చితార్థం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది.
ఈ క్రమంలోనే వీరి నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక వీరిద్దరు కూడా లండన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో కలిసి చదువుకున్నారట.
ఇలా ఇద్దరి మధ్య మంచి స్నేహబంధం ఉండడంతో స్నేహం కాస్త ప్రేమగా మారి పెళ్లి బంధం వైపు అడుగులు వేస్తోంది.
ఇక రాఘవ్ చోప్రా రాజకీయాలలో కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే.అయితే రాజకీయాలలో కొనసాగే వ్యక్తిని పరిణితి పెళ్లి చేసుకోవడానికి సిద్ధం కావడంతో ఆయనకు భారీగా ఆస్తిపాస్తులు ఉంటాయన్న కారణంతోనే ఇలా రాజకీయ నాయకుడిని పెళ్లి చేసుకోబోతుంది అంటూ వార్తలు వచ్చాయి.కానీ రాఘవ్ కన్నా పరిణితి చోప్రాకే భారీ స్థాయిలో ఆస్తులు ఉన్నాయని తెలుస్తోంది.
ఇక పరిణితి చోప్రా ఆస్తుల విషయానికి వస్తే ఈమెకు సుమారు 160 కోట్ల పైగా ఆస్తుపాస్తులు ఉన్నాయని బీ టౌన్ సమాచారం.
బాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్నటువంటి వారిలో పరిణితి చోప్రా ఒకరు.ఇండస్ట్రీలో కొనసాగుతూ ఈమె భారీగానే ఆస్తులు కూడా పెట్టారని తెలుస్తుంది.ఇక రాజకీయాలలో కొనసాగుతున్నటువంటి రాఘవ్ ఆస్తులు 80 కోట్ల వరకు ఉన్నాయని సమాచారం.
అయితే ఈయనకు బ్లాక్ మనీ భారీగానే ఉందని పైకి మాత్రం అసలు లెక్కలు చెప్పడం లేదంటూ మీడియా సభ్యులు చెబుతున్నారు.వీరిని నిశ్చితార్థ వేడుకకు ఎంతోమంది సినీ రాజకీయ ప్రముఖులు హాజరై సందడి చేశారు.
త్వరలోనే వీరి వివాహ తేదీని ప్రకటించబోతున్నారు.