ఉప్పెన( Uppena ) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా వైష్ణవ్ తేజ్( Vaishnav Tej ) మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు.తొలి సినిమాతోనే వైష్ణవ్ తేజ్ భారీ సక్సెస్ ను ఖాతాలో వేసుకోవడంతో అతనికి కెరీర్ పరంగా తిరుగులేదని కామెంట్లు వినిపించాయి.
అయితే కొండపొలం( Kondapolam ), రంగ రంగ వైభవంగా సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్లుగా నిలిచి వైష్ణవ్ కు భారీ షాకిచ్చాయి.కథల ఎంపికలో వైష్ణవ్ తేజ్ తడబడుతున్నాడని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే తాజాగా వైష్ణవ్ తేజ్ కొత్త సినిమా గ్లింప్స్ విడుదలైంది.ఆదికేశవ( Adikeshava ) అనే టైటిల్ తో ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతుండగా ఈ గ్లింప్స్ ను చూసిన ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు.
ఆదికేశవ గ్లింప్స్ చూస్తే ఆచార్య( Acharya ) మూవీ గుర్తుకొస్తోందంటూ నెటిజన్ల నుంచి వ్యంగ్యంగా కామెంట్లు వినిపిస్తున్నాయి.వైష్ణవ్ తేజ్ కెరీర్ పరంగా తప్పటడుగులు వేస్తున్నాడని ఇలాంటి సినిమాలలో నటించడం వృథా ప్రయాస అని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి./br>

ఏ మాత్రం కొత్తదనం లేని కథ, కథనంతో ఈ సినిమా తెరకెక్కుతోంది.కొత్త దర్శకుడు శ్రీకాంత్ రెడ్డి( Srikanth Reddy ) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.ఊరమాస్ సినిమాలో వైష్ణవ్ తేజ్ నటిస్తుండగా గ్లింప్స్ కు నెగిటివ్ టాక్ రావడంతో ఫ్యాన్స్ ఒకింత ఫీలవుతున్నారు.ఆచార్య తరహా స్టోరీ లైన్ తోనే ఆదికేశవ తెరకెక్కుతుండటం గమనార్హం.
కొత్తదనం లేని కథలను ఎంచుకోవద్దని ఫ్యాన్స్ సూచిస్తున్నారు./br>

ఈ సినిమాకు త్రివిక్రమ్ భార్య సాయి సౌజన్య( Sai Sowjanya ) నిర్మాణ భాగస్వామిగా ఉన్నారని తెలుస్తోంది.జులై( July ) నెలలో ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది.విరూపాక్ష సినిమాతో సాయితేజ్( Saitej ) కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ను సొంతం చేసుకోగా వైష్ణవ్ తేజ్ కు కూడా వరుస విజయాలు దక్కాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
ఆదికేశవ సినిమాతో వైష్ణవ్ తేజ్ ఫ్యాన్స్ ఆశలను నెరవేరుస్తారేమో చూడాలి.ఒకింత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కినట్టు తెలుస్తోంది.