దక్షిణాది రాష్ట్రాల్లో బలం పెంచుకునేందుకు చాలాకాలంగా కేంద్ర అధికార పార్టీ బిజెపి( BJP ) ప్రయత్నిస్తోంది .ఇప్పటికే కర్ణాటకలో ఆ కోరిక తీరినా, తెలంగాణ ( Telangana ), ఏపీ( AP ) లలో మాత్రం ఇప్పటివరకు బిజెపికి అధికారం దక్కలేదు.
తెలంగాణలో ప్రస్తుతం అధికార పార్టీగా ఉన్న బీఆర్ఎస్( BRS ) కు గట్టి పోటీ ఇచ్చే స్థాయిలో బిజెపి బలోపేతం అయింది.రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్( Congrass ) బిజెపి మధ్య ప్రధాన పోటీ ఉన్న బిజెపికి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లుగా పరిస్థితి నెలకొంది.
కానీ ఏపీలో మాత్రం ఆ పరిస్థితి లేదు.ఎప్పటి నుంచో బలపడాలని చూస్తున్నా, ఇక్కడ రాజకీయ పరిస్థితులు బిజెపికి కలిసి రావడం లేదు.
టిడిపితో పొత్తు పెట్టుకుని 2019 ఎన్నికల్లో గెలుపొందినా కొంతకాలం మాత్రమే ఆ పొత్తు కొనసాగింది.అయితే ఇప్పుడు ఏపీ అధికార పార్టీగా ఉన్న వైసీపీని ఓడించేందుకు తమ మిత్రపక్షంగా ఉన్న జనసేన( Janasena )తో కలిసి బిజెపి ప్రయత్నాలు చేస్తోంది.
ఇప్పటికే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ని పార్టీలో చేర్చుకోవడంతో, ఆయనకు ఏపీలో చేరికల బాధ్యతలను అప్పగించినట్లు తెలుస్తోంది. కిరణ్ కుమార్ రెడ్డికి కాంగ్రెస్ లో విస్తృతంగా పరిచయాలు ఉండడంతో, ఆ పార్టీ కి చెందిన మాజీ ఎంపీలు పల్లం రాజు, తోట నరసింహం, ఏరాసు ప్రతాపరెడ్డి,జీవీ హర్ష కుమార్ వంటి నాయకులతో సంప్రదింపులు చేస్తున్నారట.