అప్పట్లో టాప్ డైరెక్టర్ గా మంచి పేరు సంపాదించుకున్న ఇవివి సత్యనారాయణ గారి కొడుకు గా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చాడు అల్లరి నరేష్… 2002 వ సంవత్సరంలో రవిబాబు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అల్లరి’.ఈ చిత్రంతోనే డైరెక్టర్ గా రవిబాబు, హీరోగా నరేష్ ఎంట్రీ ఇచ్చారు.2002 మే 10 న ఈ చిత్రం రిలీజ్ అయ్యింది.నేటితో ఈ చిత్రం రిలీజ్ అయ్యి 21 ఏళ్ళు పూర్తికావస్తోంది.
ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఈ క్రమంలో ‘అల్లరి’ చిత్రం గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు వైరల్ అవుతున్నాయి.

అల్లరి చిత్రాన్ని రవిబాబు ‘ఫ్లైయింగ్ ఫ్రాగ్స్’ అనే బ్యానర్ ను స్థాపించి ఓ చిన్న సినిమాగా తీయాలనుకున్నారట.ముందుగా ఈ లైన్ ను తన స్నేహితుడు సురేష్ బాబుకి వినిపించాడు.అయితే ‘సురేష్ ప్రొడక్షన్స్’ బ్యానర్ పై పెద్ద సినిమాలు నిర్మిస్తున్నారు.
ఆ టైంలో చిన్న సినిమా ఎందుకా అని సురేష్ బాబు ఆలోచనలో పడ్డారు.అయినా రవిబాబు కాన్ఫిడెన్స్ పై నమ్మకంతో రవిబాబుకి సపోర్ట్ ఇచ్చి ‘ఫ్లైయింగ్ ఫ్రాగ్స్’ అనే బ్యానర్ ను స్థాపించేలా చేశారు…

అయితే రవిబాబు .మొదటి సినిమాకే నిర్మాణ రంగంలోకి వెళ్లడం కరెక్టేనా అనే ఆలోచన వచ్చింది.అదే విషయాన్ని తన తండ్రి చలపతి రావుకి చెప్పగా.
ఆయన ‘మన సినిమా ఎవ్వడూ కొనడు.కాబట్టి మనం సురేష్ బాబు, రామానాయుడు ల సపోర్ట్ తీసుకుని వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్టర్ ను వాడుకుందాం అని చెప్పారట.
తండ్రి మాటలతో రవిబాబు కూడా కన్విన్స్ అయ్యాడు…
అయితే ఈ సినిమా మీద మొదట ఎవరికి పెద్దగా ఇంట్రెస్ట్ లేదు, కానీ ఈ సినిమా ని రవిబాబు చాలా సీరియస్ గా తీసుకొని చేశారు…అయితే ఈ సినిమా షూటింగ్ 25 రోజుల్లో పూర్తి అయింది అలాగే ఈ సినిమాకి పెట్టిన బడ్జెట్ 70 లక్షలు కాగా ఈ సినిమా ను మొదట కొనడానికి ఎవరు రాలేదు దాంతో సురేష్ బాబు దగ్గర ఉన్న కొన్ని థియేటర్లలో రిలీజ్ చేశారు ఇక ఈ సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ సంపాదించుకొని మంచి విజయాన్ని సాధించింది.ఆరోజుల్లోనే ఈ సినిమా సురేష్ బాబు కి 2 కోట్ల ప్రాఫిట్ ని కూడా తీసుకువచ్చింది…
.