మామూలుగా స్టార్ హీరోలకు ప్రేక్షక అభిమానం కాకుండా తోటి స్టార్ హీరోలు కూడా అభిమానం చూపిస్తూ ఉంటారు.వాళ్ళ సినిమాలలో చిన్న పాత్రలోనైనా అవకాశం వస్తే చాలు అని అనుకునే హీరోలు ఉన్నారంటే నమ్మాల్సిందే.
అయితే ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీలో చిరంజీవి, పవన్ కళ్యాణ్( Chiranjeevi, Pawan Kalyan ) లపై మిగతా హీరోలు బాగా అభిమానం చూపిస్తూ ఉంటారు.వీళ్ళ సినిమాలలో అవకాశాలు వస్తే చాలు అని సంతోషపడ్డ వాళ్ళు కూడా ఉన్నారు.
అలా కొంతమంది హీరోలకు వీరి సినిమాలలో అవకాశాలు కూడా వచ్చాయి.ఇక చిరంజీవి సినిమాలలో ఏకంగా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, అమితాబ్ బచ్చన్ లు నటించిన సంగతి తెలిసిందే.
వాళ్లే పెద్ద హీరోలు అయినప్పటికీ కూడా చిరంజీవి పై అభిమానం చూపించడం అంటే మామూలు విషయం కాదని చెప్పాలి.కొన్ని కొన్ని సార్లు తమకి ఇష్టమైన హీరో సినిమాలలో నటించడం కోసం కూడా తమకు వచ్చిన ఆఫర్లు కూడా వదులుకున్న హీరోలు కూడా ఉన్నారు.
అయితే తాజాగా బాలయ్య సినిమాలో నటించడం కోసం ఒక స్టార్ హీరో 100 కోట్ల ఆఫర్ ను వదులుకొని బాలయ్య పై ఉన్న అభిమానం ఏంటో చూపించాడు.మామూలుగా నందమూరి బాలయ్య కు తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.హీరోగా ఈయన మంచి పేరు సంపాదించుకొని తెలుగు ప్రేక్షకులతో మంచి అభిమానం ను సంపాదించుకున్నాడు.
ఇక ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఉన్నాడు.ఏకంగా యంగ్ హీరోలకు పోటీగా అవకాశాలు అందుకుంటూ అందర్నీ ఆశ్చర్య పరుస్తున్నారు.ఈ వయసులో కూడా ఆయన ఎనర్జీ చూసి అందరూ మురిసిపోతున్నారు.
రీసెంట్ గా వీరసింహారెడ్డి( Veerasimha Reddy ) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్నాడు.ఇక ఈ సినిమా తర్వాత ఆయన వరుసగా చాలా సినిమాలకు సైన్ చేసి షూటింగ్ లలో కూడా పాల్గొంటున్నాడు.
అయితే ప్రస్తుతం ఈయన డైరెక్టర్ అనిల్ రావిపూడి తో కలిసి ఎన్బికే 108 సినిమాలో చేస్తున్న సంగతి తెలిసిందే.ఇక ఇందులో కాజల్ అగర్వాల్, శ్రియ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
అంతేకాకుండా ధమాకా బ్యూటీ శ్రీ లీల కూడా ఇందులో ఒక పాత్రలో నటించనుంది.
ఇక ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచుకున్నారు ప్రేక్షకులు.అయితే తాజాగా ఈ సినిమా నుండి ఒక న్యూస్ బాగా వైరల్ అవుతుంది.అదేంటంటే ఈ సినిమాలో బాలయ్యకు విలన్ గా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ( Akshay Kumar )నటించనున్నట్లు వార్త వినిపిస్తుంది.అంతేకాకుండా బాలయ్య పై ఉన్న అభిమానంతో అక్షయ్ కుమార్ తనకు వచ్చిన రూ.100 కోట్ల ఆఫర్ ని కూడా రిజెక్ట్ చేశాడట.అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఇప్పుడు ఈ విషయం తెలియడంతో బాలయ్య పై ఉన్న అక్షయ్ కుమార్ అభిమానం చూసి ఫీదా అవుతున్నారు బాలయ్య అభిమానులు.