స్మార్ట్ యుగంలో ఇపుడంతా ఆన్లైన్ మహిమే నడుస్తోంది.ఇష్టమైన దుస్తులు కొనాలన్నా, రుచికరమైన ఆహారం తినాలన్నా ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే క్షణాల్లో మనముందు ఉంటుంది అనడంలో సందేహమే లేదు.
ముఖ్యంగా యువత దాదాపుగా ఆన్లైన్ మాధ్యమాలద్వారానే తమకు ఇష్టమైన ఆహారాన్ని ఆర్డర్ పెట్టుకొని తింటున్నట్టు తాజా సర్వేలు చెబుతున్నాయి.అయితే ఈ క్రమంలో కొన్ని ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్ అప్పుడప్పుడు తమ కస్టమర్లకు షాకిచ్చిన ఘటనలు మనం చూస్తూ వున్నాం.
తాజాగా అలాంటి ఓ సంఘటనే జరిగింది.దాంతో అది కాస్త సోషల్ మీడియాలో( Social Media ) తెగ వైరల్ అవుతోంది.అయితే మీరు ఎప్పుడన్నా ఆర్డర్ అందుకున్న ఆహారాన్ని టేపు పెట్టి కొలవడం వంటివి ఎపుడైనా చేసారా? దాదాపుగా ఎవ్వరూ చేసుండరు కదా.అయితే ఆమె చేసింది.అందుకే ఆమె ఇపుడు సోషల్ మీడియాలో టాక్ అఫ్ ది టౌన్ అయింది.ఒక మహిళ ( Woman ) ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసి తెప్పించుకున్న పిజ్జా ( Pizza ) సైజును కొలిచింది.
దాంతో ఆన్‌లైన్ పిజ్జా అసలు రహస్యం గుట్టురట్టయింది.
దాంతో ఆమె ఆ ఫిజ్జా ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తనకు ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకున్నారు.దీనిపై నెటిజన్లు సైతం భిన్నమైన రీతిలో స్పందించడం విశేషం.ట్విట్టర్ లో ఆమె దీనిని పోస్ట్ చేస్తూ… “నేను 10 అంగుళాల పిజ్జాను ఆర్డర్ చేసాను, వారు నాకు 8 అంగుళాల పిజ్జాను పంపారు.” అని పేర్కొంది.ఇక ఇక్కడ పిజ్జా పైన ఒక స్కేల్ (ఇంచ్ టేప్) కూడా పెట్టి కొలిచినట్టుగా మనకు ఈ ఫోటోలో స్పష్టంగా కనబడుతోంది.
అంటే ఆమె 2 అంగుళాలు పిజ్జా లాస్ అయింది.దాంతో తీవ్ర ఆగ్రహనికి గురైన మహిళ పిజ్జా ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.కాగా ఆ మహిళ చేసిన ట్విట్‌కు ఇప్పటికే 99 వేలకు పైగా వ్యూస్, వేల సంఖ్యలో లైకులు వచ్చాయి.