తెలుగు ప్రేక్షకులకు ఏఆర్ రెహమాన్ ( AR Rahman )గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.తెలుగుతో పాటు ఎన్నో అద్భుతమైన పాటలకు ప్రాణం పోశారు ఏ ఆర్ రెహమాన్.
అంతేకాకుండా మ్యూజిక్ డైరెక్టర్గా తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు.ఇక మ్యూజిక్ డైరెక్టర్( Music Director ) గా ఎన్నో అవార్డులు రివార్డులు సైతం అందుకున్నారు.
తండ్రి వారసత్వాన్ని పుచ్చుకున్న రెహమాన్ ఎంతోమంది మ్యూజిక్ డైరెక్టర్ల దగ్గర పనిచేసే సంగీత దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరుచుకున్నారు.
ప్రస్తుతం సౌత్, నార్త్ ఇండస్ట్రీలో ఉన్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్ లలో ఏఆర్ రెహమాన్ కూడా ఒకరు.మ్యూజిక్ డైరెక్టర్ గా రెండు ఆస్కార్ అవార్డులను సైతం సొంతం చేసుకున్నాడు.ఇది ఇలా ఉంటే తాజాగా ఏఆర్ రెహమాన్ కు స్టేజి పైన ఒక చేదు అనుభవం ఎదురయింది.
పూర్తి వివరాల్లోకి వెళితే.తాజాగా పూణేలో( Pune ) జరిగిన మ్యూజిక్ కన్సెర్ట్‌లో లో ఏఆర్ రెహమాన్ కి చేదు అనుభవం ఎదురైంది.
రెహమాన్ మ్యూజిక్ షోకి భారీ ఎత్తున ప్రేక్షకులు భారీగా తరలి వచ్చారు.ఆయన తన పాటలతో ఉర్రూతలు ఊగిస్తున్న సమయంలో పోలీసులు సడన్ గా స్టేజ్ పైకి ఎంట్రీ ఇచ్చారు.
ఏఆర్ రెహమాన్ పాడుతుండగా అడ్డుకున్నారు.
మ్యూజిక్ షోని వెంటనే ఆపివేయాలని బ్యాండ్ సభ్యుల్ని కోరారు.అప్పటికే సమయం దాటిపోయిందని మ్యూజిక్ కన్సెర్ట్ ను ముగించాలని సూచించారు.పోలీసులు చెప్పడంతో వెంటనే షోని ముగించేశారు షో నిర్వహకులు.
కాగా తాజాగా ఏ ఆర్ రెహమాన్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ కన్నెర్ట్ ను విజయవంతం చేసినందుకు పూణే అభిమానులకు చాలా కృతజ్ఞతలు తెలిపారు.