సాధారణంగా డెలివరీ అనంతరం చాలా మంది మహిళలు అధిక హెయిర్ ఫాల్( Hair fall ) సమస్యతో తీవ్రంగా సతమతం అవుతుంటారు.ఆహారపు అలవాట్లు, కంటి నిండా నిద్ర లేకపోవడం, ఒత్తిడి, హార్మోన్ చేంజ్ తదితర కారణాల వల్ల జుట్టు విపరీతంగా రాలిపోతుంటుంది.
ఎంత ఖరీదైన నూనె, షాంపూ వాడిన హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వదు.దాంతో ఏం చేయాలో తెలియక తెగ హైరానా పడుతుంటారు.
కానీ పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే ఈజీగా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.అందుకు ఇప్పుడు చెప్పబోయే రెమెడీ చాలా అద్భుతంగా సహాయపడుతుంది.
ఇంతకీ ఆ రెమెడీ ఏంటి అనేది ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఒక కలబంద( Aloe vera ) ఆకును తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి లోపల ఉండే జెల్‌ను సపరేట్ చేసుకోవాలి.ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు ఫ్రెష్ అలోవెరా జెల్ వేసుకోవాలి.అలాగే రెండు టేబుల్ స్పూన్లు ఆముదం( castor oil ), వన్ టేబుల్ తేనె, వన్ టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె, వన్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ జ్యూస్ లో నాలుగు చుక్కలు రోజ్మేరీ ఎసెన్షియల్ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేస్తే అద్భుతమైన హెయిర్ టోనర్ సిద్ధం అవుతుంది.
ఈ హెయిర్ టోనర్ ను స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.రెండు గంటల అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.ప్రసవం అనంతరం వారానికి రెండు సార్లు ఈ విధంగా చేస్తే జుట్టు రాలడం క్రమంగా తగ్గుముఖం పడుతుంది.
అదే సమయంలో జుట్టు ఒత్తుగా పొడుగ్గా పెరుగుతుంది.తలలో చుండ్రు సమస్య ఉంటే మాయం అవుతుంది.
చిట్లిన జుట్టు సైతం రిపేర్ అవుతుంది.కాబట్టి ప్రసవం అనంతరం విపరీతంగా జుట్టు రాలుతుందని సతమతం అవుతున్నవారు ఇంట్లోనే ఇలా సమస్యను పరిష్కరించుకోండి.
ఈ రెమెడీ హెయిర్ ఫాల్ ను కంట్రోల్ చేయడానికి చాలా ఉత్తమంగా సహాయపడుతుంది.