ఏప్రిల్‌కు సంబంధించి ఎఫ్వై24 కార్ సేల్స్ డేటాను తాజాగా ప్రకటించింది.ఈ క్రమంలో దిగ్గజ ఆటోమొబైల్ సంస్థలు అయినటువంటి కియా, మారుతీ సుజుకీ మోటార్స్ సేల్స్ వివరాలు ఈ విధంగా వున్నాయి.ఇపుడు మారుతి సుజికి( Maruti Suzuki ) విషయానికొస్తే ఏప్రిల్‌లో మొత్తం మీద 1,60,529 యూనిట్లను విక్రయించినట్టు గణాంకాలు చెబుతున్నాయి.2022 ఏప్రిల్‌లో ఈ నెంబర్ 1,50,661గా ఉండగా ఇపుడు అది కాస్త పది శాతం పెరగడం విశేషం.ఈ 1,60,529 యూనిట్లలో 1,39,519 కార్లను దేశీయం విక్రయించగా.4,039 ఓవీఎంలు, 16,971 ఎగుమతులు ఉన్నాయి.ఈ మేరకు ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో మారుతీ సుజుకీ కూడా పేర్కొంది.
మారుతీ సుజుకీ సేల్స్‌లో చిన్న కార్ల హవా తాజాగా తగ్గినట్టు కనిపిస్తోంది.ఆల్టో కే10, ఎస్-ప్రెస్సో వంటి కార్లు.2022 ఏప్రిల్‌లో 17,137 యూనిట్లు అమ్ముడుపోగా.ఈసారి కేవలం 14,110 మాత్రమే సేల్ అమ్ముడు కావడం కిసమెరుపు.అయితే యుటిలిటీ వెహికిల్స్ అంచనాలకు మించి రాణిస్తుండటం విశేషం అని చెప్పుకోవాలి.అదేవిధంగా కియా మోటార్స్( Kia Motors ) విషయానికొస్తే ఎప్పటిలాగానే ఈసారి కూడా కియా మోటార్స్ ఇరగదీసిందని చెప్పుకోవాలి.ఏప్రిల్‌లో సంస్థ విక్రయాలు 22శాతం పెరగడం విశేషసం!
గత నెలలో 23,216 యూనిట్లను విక్రయించినట్టు కియా ప్రకటించింది.సోనెట్, సెల్టోస్‌కు మంచి డిమాండ్ వుంది.సోనెట్ 9,744 యూనిట్లు అమ్ముడుపోగా సెల్టోస్‌కు సంబంధించి 7,214 యూనిట్లను విక్రయించింది కియా.
మూడో బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా ఉన్న క్యారెన్స్ వాహనాలు అయితే 6,107 అమ్ముడు పోయినట్టు సమాచారం.ఈ నేపథ్యంలో కియా ఇండియా సేల్స్, మార్కెటింగ్ నేషనల్ హెడ్ హర్దీప్ సింగ్ బ్రార్ మాట్లాడుతూ… దేశంలో 7లక్షల సేల్స్ మార్క్‌ను అందుకున్నట్టు ప్రకటించారు.