రాజకుమారుడు సినిమాతో హీరో గా ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు( Mahesh Babu ) ఆ సినిమాతోనే సక్సెస్ అందుకున్నాడు.హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న తర్వాత తన యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్‌కు తోడు హ్యాండ్సమ్ లుక్స్‌తో అదరగొట్టేసి స్టార్ హీరోగా ఎదిగిపోయాడు…అప్పటి నుంచి ఏమాత్రం వెనక్కి తిరిగి చూడకుండా దూసుకుపోతోన్నాడు.
ఈ క్రమంలోనే ఇప్పుడు మహేశ్ బాబు.త్రివిక్రమ్ శ్రీనివాస్( Trivikram ) దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.
తాజాగా ఈ మూవీ నుంచి అదిరిపోయే న్యూస్ ఒకటి బయటకు వచ్చింది.ఆ సంగతులేంటో తెలుసుకుందాం…
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేశ్ బాబు మూడో సినిమాను చేస్తోన్న విషయం తెలిసిందే.
ఈ మూవీని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు.పూజా హెగ్డే, శ్రీలీల ఇందులో హీరోయిన్లుగా చేస్తున్నారు.
థమన్ ఈ సినిమాకు సంగీతం ఇస్తున్నాడు.ఈ సినిమాలో ఇప్పటికే ప్రకాష్ రాజ్,సాయి కుమార్,సోనూసూద్,మమ్ముట్టి లాంటి స్టార్ నటులు ఈ సినిమాలో ఉన్నట్టుగా తెలుస్తుంది…ఇక తెలుగులో మార్కెట్ పెంచుకోవడానికి మమ్ముట్టి వరుసగా తెలుగు సినిమాలు చేస్తున్నట్టు గా తెలుస్తుంది…
రెండు క్రేజీ మూవీల తర్వాత మహేశ్ బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్ చాలా రోజుల క్రితమే మొదలైంది.ఆ వెంటనే మొదటి షెడ్యూల్ కూడా విజయవంతంగా కంప్లీట్ చేశారు.తర్వాత కొన్ని ఆటంకాలు ఎదురయ్యాయి.
అయినా దాని తర్వాత నుంచి ఈ సినిమా షూటింగ్ శరవేగంగా చేసేలా ప్లాన్లు చేసుకుంటున్నారు.వాస్తవానికి ఈ సినిమాను
ఈ ఏడాది ఆగస్టు 11న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ముందుగానే ప్రకటించింది.కానీ, షూటింగ్ సజావుగా సాగని కారణంగా దీన్ని వాయిదా వేస్తున్నారని వార్తలు వచ్చాయి… అందుకు అనుగుణంగానే ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా తీసుకు వస్తున్నారు… దీనికి సంబంధించిన పోస్టర్‌ను కూడా చిత్ర యూనిట్ ఇటీవలే విడుదల చేసింది…ఇక ఈ సినిమా షూటింగ్ చాలా స్పీడ్ గా చేస్తున్నట్లు గా తెలుస్తుంది…
.