PS2 Controversy : వివాదంలో చిక్కుకున్న పొన్నియిన్ సెల్వన్2.. చరిత్రను వక్రీకరించారంటూ?

అప్పుడప్పుడు కొన్ని సినిమాలు వివాదాలలో ఇరుకుతాయి.దీనివల్ల సినిమా తీసిన దర్శకుడికే విమర్శలు వస్తూ ఉంటాయి.

 Controversy Over The Climax Of Ponniyin Selvan 2-TeluguStop.com

ఇప్పుడు అటువంటిదే డైరెక్టర్ మణిరత్నంకు ఎదురవుతుంది.రీసెంట్ గా మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన పొన్నియిన్ సెల్వన్2( Ponniyin Selvan 2 ) ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.

ఇందులో స్టార్ సెలబ్రెటీలను తీసుకున్నాడు డైరెక్టర్ మణిరత్నం.

Telugu Aishwarya Rai, Mani Ratnam, Nandini, Ponniyin Selvan, Vikram-Movie

గతంలో పార్ట్ 1 విడుదల కాగా ఆ సినిమా తమిళంలో మంచి బ్లాక్ బస్టర్ హిట్టు సొంతం చేసుకుంది.ఇక పార్ట్ 2 ఏప్రిల్ 28న విడుదల అయింది.ఇక పార్ట్ 2 కూడా పాజిటివ్ టాకే సొంతం చేసుకుంది.

కానీ ఈ సినిమా క్లైమాక్స్ ఇప్పుడు వివాదంలో ఇరికిందని తెలుస్తుంది.అదేంటంటే.

నిజానికి ఈ సినిమా చోళులు, పాండ్యుల కథ( Chola Pandya Story ) అని అందరికీ తెలిసిందే.ఒకప్పుడు తమిళనాడు రాజ్యాన్ని చోళులు, పాండ్యులు పరిపాలించారు.

కొన్ని వేల సంవత్సరాల కిందట ఈ రెండు వర్గాల మధ్య యుద్ధాలు జరిగాయి.ఇక ఇప్పటికీ ఈ రెండు వర్గాల గురించి రచ్చ జరుగుతూనే ఉంటుంది.అయితే చోళ రాజుని ఓ పాండ్య మహిళ వాళ్లని నమ్మించి ఎలా చంపేసింది అనేది క్లైమాక్స్ లో చూపించాడు డైరెక్టర్.అయితే ఇది నిజంగా జరిగిన కథనుండే తీసుకున్నాడు మణిరత్నం( Maniratnam ).

Telugu Aishwarya Rai, Mani Ratnam, Nandini, Ponniyin Selvan, Vikram-Movie

ఇక ఈ సినిమాలో పాండ్య మహిళగా ఐశ్వర్యరాయ్( Aishwarya RRai ) కనిపించగా.చోళ రాజుగా విక్రం నటించాడు.అయితే క్లైమాక్స్ లో ఐశ్వర్యరాయ్ విక్రమ్( Vikram ) ను ప్రేమ వల్ల చంపలేకపోవటంతో.ఇక విక్రం ఐశ్వర్య చేతిలో కత్తిపెట్టి తనంతట తానే పొడ్చుకొని చచ్చిపోతాడు.

అయితే ఇక్కడ డైరెక్టర్ మణిరత్నం అసలైన స్టోరీని కాకుండా అక్కడ ప్రేమ సన్నివేశాన్ని కీలకంగా మార్చాడు.

Telugu Aishwarya Rai, Mani Ratnam, Nandini, Ponniyin Selvan, Vikram-Movie

దీంతో క్లైమాక్స్ ఈ విధంగా ఉండటంతో ప్రస్తుతం తమిళనాడు( Tamilnadu )లో వివాదం ఏర్పడింది.దీంతో మణిరత్నం పై విమర్శలు చేస్తున్నారు.చోళుల రాజు ఆదిత్య కరికాళుడిని( Aditha Karikalan ) పాండ్య మహిళ నందిని నమ్మించి మోసం చేసి చంపేసిందని.

అతడు ఆత్మహత్య చేసుకోలేదని.కానీ సినిమాలో మాత్రం తనంటే తానే చనిపోయినట్లు చూపించారు అని.ఇది చాలా తప్పు అంటూ నందిని చేతిలో కరికాళుడు హత్య చేయబడ్డాడు అంటూ వివాదం సృష్టించారు.మరి ఈ వివాదం గురించి మణిరత్నం ఏమని స్పందిస్తాడో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube