యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్( NTR ) రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కి 2003 సంవత్సరంలో విడుదలైన సింహాద్రి సినిమా( Simhadri Movie ) బ్లాక్ బస్టర్ అనే సంగతి తెలిసిందే.దాదాపుగా 20 సంవత్సరాల క్రితమే ఈ సినిమా అప్పటి టికెట్ రేట్లతో ఏకంగా 26 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం కలెక్షన్లను సొంతం చేసుకుంది.
నిర్మాతకు ఈ సినిమా భారీ స్థాయిలోనే లాభాలను ఆందించింది.ఆది సినిమాతో ఎన్టీఆర్ కు మాస్ ప్రేక్షకుల్లో ఫాలోయింగ్ రాగా ఈ సినిమా ఆ ఫాలోయింగ్ ను మరింత పెంచింది.
అయితే ఈ సినిమాలోని పాటలకు సంబంధించి కీరవాణి( Keeravani ) తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు.రాజమౌళితో నేను సింహాద్రి అనే సినిమా చేశానని ఆ సినిమాలో రికార్డ్ చేసిన పాటలన్నీ ఫ్లాప్ పాటలే అని ఆయన అన్నారు.
సింహాద్రి సినిమాకు ముందే కొన్ని సినిమాలలో నా మ్యూజిక్ డైరెక్షన్ లో వచ్చిన పాటలను కంపోజిషన్ మార్చి సింహాద్రి సినిమాలో పెట్టడం జరిగిందని కీరవాణి కామెంట్లు చేయడం గమనార్హం.
సింహాద్రి సినిమాలోని ప్రతి పాట ఒక ఫ్లాప్ సాంగ్ అని అయితే ఆ పాటల విలువ రాజమౌళికి తెలుసని కీరవాణి పేర్కొన్నారు.సింహాద్రి సినిమాలోని చిన్నదమ్మే చీకులు కావాలా సాంగ్ సమర్పణ అనే సినిమా లోనిదని ఆయన చెప్పుకొచ్చారు.అయితే సింహాద్రి సినిమాలో ఉన్న పాటలు కంపోజిషన్ మార్చిన పాత సినిమాల పాటలే అయినా ఆ పాటలు ఏ రేంజ్ లో హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
నాటు నాటు సాంగ్ కు ఆస్కార్ అవార్డ్ వచ్చిన తర్వాత తనకు సినిమా ఆఫర్లు ఎక్కువగా వస్తున్నాయని ఆయన కామెంట్లు చేశారు.ఆస్కార్ రాకముందే నాలోని ప్రతిభను గుర్తించి ఉంటే బాగుండేదని కీరవాణి అభిప్రాయం వ్యక్తం చేశారు.కీరవాణి వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.