ఈ ఐపీఎల్ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్( Delhi Capitals ) వరుస ఓటములతో లీగ్ పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో కొనసాగుతోంది.ఆడిన ఐదు మ్యాచ్లలో ఓడి, ఇంతవరకు బోణి కొట్టలేదని బాధలో ఉన్న జట్టుకు మరో చేదు అనుభవం ఎదురయింది.
ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాళ్ల కు సోషల్ మీడియాలో విమర్శలు ఎదురవుతున్నాయి.అసలు విషయం ఏమిటంటే.
ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాళ్ల క్రికెట్ కిట్లు( Cricket Kits ) చోరీకి గురయ్యాయి.గత శనివారం బెంగుళూరు – ఢిల్లీ ( RCB vs DC ) మధ్య జరిగిన మ్యాచ్లో 23 పరుగుల తేడాతో ఢిల్లీ ఓడిన సంగతి తెలిసిందే.
అయితే మ్యాచ్ అనంతరం మంగళవారం ఢిల్లీ చేరుకున్న ఆ జట్టు యొక్క బ్యాట్లు, ప్యాడ్ లు ఇంకా ఇతర వస్తువులు చోరీ అయ్యాయి.
ఢిల్లీ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్ బ్యాట్లు కూడా కనిపించకుండా పోయాయి.బెంగుళూరు నుండి ఢిల్లీకి చేరుకున్న జట్టు బస చేసే హోటల్ రూమ్ కు వచ్చాక తమ వస్తువులు చోరీకి గురైన సంగతి తెలిసింది.ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ ఈ చోరీపై లాజిస్టిక్ కంపెనీకి, ఢిల్లీ ఎయిర్ పోర్ట్ సెక్యూరిటీ సిబ్బందికి, పోలీసులకి ఫిర్యాదు చేసింది.
చోరీకి గురైన ఒక్కొక్క బ్యాట్ ఖరీదు రూ.లక్ష ఉంటుందని, జట్టులో ఉండే ప్రతి ఆటగాడికి సంబంధించి ఏదో ఒక వస్తువు పోయినట్లు ఢిల్లీ ఫ్రాంచైజీ తెలిపింది.
ఇక గురువారం ఢిల్లీ – కోల్ కత్తా మధ్య మ్యాచ్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగనుంది.ఆటగాళ్లు కొత్త బ్యాట్ల కోసం తమ ఏజెంట్లను సంప్రదించారు.ఈ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఒకవైపు వరుస ఓటములతో సతమతమవుతుంటే.మరొకవైపు క్రికెట్ కిట్ల బ్యాగులు చోరీ అవడం అనేది చేదు అనుభవం అనే చెప్పాలి.ఈ విషయం తెలిసిన వారంతా రకరకాలుగా కామెంట్లు చేస్తుంటే.ఢిల్లీ క్యాపిటల్స్ అభిమానులు ఆ కామెంట్లను తిప్పికొట్టే పనిలో ఉన్నారు.