వైయస్ వివాకానంద రెడ్డి( YS Vivakananda Reddy ) హత్య కేసులో వేగం పెంచిన సిబిఐ అరెస్టులు దిశగా ముందుకు సాగుతుంది.ఇప్పటికే వైయస్ అవినాష్ రెడ్డి ముఖ్య అనుచరుడు ఉదయ్ కుమార్( Uday Kumar ) రెడ్డిని అరెస్ట్ చేసిన సిబిఐ మరిన్ని అరెస్టులు దిశగా ముందుకు వెళ్తుందని వార్తలు వచ్చాయి ఇప్పుడు పులివెందులలోని వైఎస్ అవినాష్ రెడ్డి ఇంటికి వెళ్లిన సిబిఐ అధికారులు వైఎస్ భాస్కర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.
ఆయనను న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టగా న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించారు కాగా వైఎస్ భాస్కర్ రెడ్డి( YS Bhaskar Reddy )ని తమ కస్టడీకి అప్పజెప్పాలని సిబిఐ న్యాయస్థానంలో పిటిషన్ వేసింది ఆయన విచారణకు సరిగ్గా సహకరించలేదని, అంతేకాకుండా కీలక సాక్షాదారాలను మాయం చేసే ప్రయత్నం కూడా చేశారని, సాక్షులను ప్రభావితం చేస్తున్నారని అందుకే అరెస్టు అరెస్టు చేయాల్సి వచ్చిందని ఆయనను మాకు అప్పగిస్తే మరిన్ని ఆధారాలు సేకరిస్తామని సిబిఐ న్యాయస్థానానికి తెలిపింది .పిటిషన్ను స్వీకరించిన సిబిఐ న్యాయస్థానం కేసు రేపటికి వాయిదా వేసింది .

రాజకీయ అధికారం కోసమే వైయస్ వివేకానంద రెడ్డిని( YS Vivekananda Reddy ) హత్య చేశారని సానుభూతి పనిచేస్తుందని వైయస్ జగన్ కూడా దీనికి సహకరించారని తెలుగుదేశం నాయకులు ఎప్పటినుంచో ఆరోపణలు చేస్తున్నారు.అయితే పోలీస్ వ్యవస్థ పై తనకు నమ్మకం లేదని కేసులు సిబిఐ కి బదిలీ చేసి తెలంగాణకి మార్చాల్సిందిగా వైయస్ వివేకానంద రెడ్డి కుమార్తె వైఎస్ సునీత(
YS Sunitha ) హైకోర్టులో వేసిన కేసు వల్ల పరిణామాలు చాలా వేగంగా మారాయి ….ఇప్పటివరకూ విచారణకు మాత్రమే పరిమితమైన సీబీఐ ఇప్పుడు అరెస్ట్ ల దిశగా ముందుకు వెళ్లడంతో రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్( Andhra Pradesh ) లో రాజకీయ సమీకరణాలు చాలా వేగంగా మారతాయని మరిన్ని అరెస్టులు తప్పవని అంచనాలు వస్తున్నాయి .

ఇప్పటివరకు ఏ కేసులోనూ జరగనున్నటువంటి విచిత్రమైన మలుపులు ఈ కేసు విషయంలో జరిగాయి ,పోలీసులు ఈ కేసును తప్పుదారి పట్టిస్తున్నారు అంటూ సిబిఐ అధికారులు పోలీసులపై ఆరోపణలు చేయడం గమనార్హం ….ఇప్పటి వరకూ రకరకాల మలుపులు తిరిగిన ఈ కేసు లో చివరకు ఏ రకమైన తీర్పు వస్తుందో ఆయన కుమార్తె పడిన కష్టానికి ఫలితం దక్కుతుందో లేదో చూడాలి.