అక్కినేని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అఖిల్ ఏజెంట్ చిత్రం( Akhil Agent Movie 0 ఎట్టకేలకు ఈనెల 28న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.ఈ సినిమా విడుదల ఉంటుందా లేదా అంటూ నిన్న మొన్నటి వరకు కూడా అనుమానాలు ఉండేవి.
ఎట్టకేలకు సినిమా ప్రమోషన్ మొదలు పెట్టడంతో యూనిట్ సభ్యులు విడుదల పై ఉన్న అనుమానాలకు ఒక క్లారిటీ ఇచ్చినట్లు అయింది.హీరో గా అఖిల్( Akkineni Akhil ) కు ఇది మొదటి బ్లాక్ బస్టర్ సినిమా గా నిలువబోతుంది అంటూ అంతా నమ్మకం గా ఉన్నారు.
అంతే కాకుండా ఈ సినిమా గురించి ఉన్న రకరకాల పుకార్ల గురించి తాజాగా ఒక మీడియా సమావేశంలో యూనిట్ సభ్యులు స్పష్టతను ఇచ్చారు.మొన్నటి వరకు ఈ సినిమా కోసం ఏకంగా రెండేళ్ల సమయం పట్టిందని.అంత సమయం పట్టడం వల్ల సినిమా కు బడ్జెట్ రెట్టింపు అయ్యింది అంటూ కామెంట్స్ వస్తున్నాయి.కానీ ఈ సినిమా కు కేవలం వంద రోజులు మాత్రమే పట్టిందని.
కానీ కొన్ని కారణాల వల్ల రెండు సంవత్సరాల పాటు చేయాల్సి వచ్చిందని దర్శకుడు సురేందర్ రెడ్డి పేర్కొన్నాడు.
ఇలాంటి ఒక భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ చిత్రం( Action Entertainer ) వంద రోజుల్లో పూర్తి చేయడం అంటే గొప్ప విషయమే.కనుక ఈ సినిమా కు భారీ గా బడ్జెట్ ఎక్కువ అయ్యి ఉండదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఇక ఈ సినిమా నైజాం రైట్స్( Nizam Rights )ను ఎవరు కొనుగోలు చేయక పోవడంతో నిర్మాత అనిల్ స్వయంగా విడుదల చేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
ఆ విషయమై నిర్మాత స్పందించాడు.రెండు నెలల క్రితమే సినిమా యొక్క అన్ని ఏరియాల రైట్స్ ను అమ్మేయడం జరిగింది.అయితే నైజాం ఏరియా రైట్స్ కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్ మళ్లీ అమ్మేసుకుంటున్నాడు.అంతే తప్ప ఇక్కడ జరుగుతున్నది ఏమీ లేదని ఏజెంట్ మేకర్స్ పుకార్లన్నింటికి కూడా క్లారిటీ ఇచ్చేశారు.