మంచు మనోజ్( Manchu Manoj ) రెండో పెళ్లి ఇటీవల హాట్ టాపిక్ అయింది… పెళ్లి తర్వాత దంపతులు ఇద్దరు హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నారు ఈక్రమంలో తాజాగా మంచు మనోజ్ తన భార్య భూమా మౌనిక రెడ్డితో( Bhuma Mounika Reddy ) కలిసి ‘అలా మొదలైంది( Ala Modalaindi Show ) అనే టాక్ షోకు హాజరయ్యాడు.వెన్నెల కిశోర్ హోస్ట్ చేస్తున్న ఈ షోకు హాజరైన మంచు మనోజ్, భూమా మౌనిక రెడ్డి ఎన్నో విషయాలు పంచుకున్నారు .
మౌనిక మాట్లాడుతూ .అమ్మ జయంతి రోజున అలా ఆకాశం చూస్తూ ఎక్కడున్నావు.నాకేం కావాలో నీకు తెలుసు.అంతా నీకే వదిలేస్తున్నాను అన్నా.అప్పుడే మనోజ్ వచ్చారు.అది నా జీవితంలో మర్చిపోలేని రోజు అని చెప్పింది.
ఆ తర్వాత మంచు మనోజ్ మాట్లాడుతూ .మౌనికతో పెళ్లికి ముందు గడిపిన క్షణాలు, ఎదురైన సమస్యల గురించి మాట్లాడాడు.
ఉప్పెన సినిమాలోలా మేమూ పెళ్లికి ముందు చాలా ఇబ్బందులు పడుతూనే బాగానే తిరిగాం.అందులో ఈశ్వర సాంగ్ ఐదు నిమిషాలుంటే .మా లైఫ్‌లో కొన్ని సంవత్సరాలుంది.మేము దేశ దేశాలు, ఊర్లు తిరుగుతూ ఉన్నాం అంటూ తొలిసారి సీక్రెట్‌ను రివీల్ చేసేశాడు.
నేను మౌనిక కోసం వెళ్లాలి.అక్కడే ఉండాలి అని ఊహించేసుకుని.
హెల్ప్ చేయాలనుకున్నప్పుడు ఇబ్బందులు పడ్డాను.మనం అనుకున్నట్లే ప్రేమించాం.
ప్రేమ అనేది రెండు పక్కలా ఉండాలి.ఎటు పక్క నిలబడుతున్నానో, ఎక్కడున్నారో ఏం అర్థం కాలేదు.
సరే నీకు లవ్ లైఫ్ కావాలా, సినిమా కావాలా సెలక్ట్ చేసుకో అనే పరిస్థితి వచ్చింది అన్నాడు.
ఇక మోహన్ బాబు కుమారుడిగా సినిమాల్లోకి వచ్చి.కష్టపడేతత్వంతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నాడు మంచు మనోజ్. హీరోగా ఎన్నో ప్రయోగాలు చేసిన అతడు.
పెద్దగా సక్సెస్ కాలేకపోయాడు.పర్సనల్ లైఫ్‌లోనూ పెళ్లి బ్రేకప్ అవడంతో ఇబ్బందులు పడ్డాడు.
ఇలాంటి పరిస్థితుల్లో ఈ యంగ్ హీరో ఇటీవలే భూమా మౌనిక రెడ్డిని రెండో వివాహం చేసుకున్నాడు.మొదట మనోజ్ తన చిన్ననాటి స్నేహితురాలు ప్రణతి రెడ్డితో ప్రేమాయణం సాగించి 2015లో పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు.
కానీ, ఈ బంధం ఎంతో కాలం నిలవలేదు.
దీంతో భార్యకు విడాకులు ఇచ్చేశాడు.ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితమే రాజకీయ నేపథ్యం ఉన్న ఫ్యామిలీకి చెందిన భూమా మౌనిక రెడ్డిని మంచు మనోజ్ రెండో వివాహం చేసుకున్నాడు.భూమా మౌనిక రెడ్డితో మంచు మనోజ్ చాలా కాలంగా ప్రేమలో ఉన్నాడని ఈ మధ్యనే లీకైంది.
ఆ సమయంలోనే వీళ్ల వివాహానికి మోహన్ బాబు ఫ్యామిలీ అడ్డు చెప్పిందని, ఈ విషయమై మనోజ్ ఇంటికి కూడా దూరం అయ్యాడని వార్తలు వచ్చాయి.కానీ, వీళ్ల వివాహానికి అందరూ హాజరయ్యారు.
ఆ తర్వాత కూడా కొన్ని గొడవలు అంటూ ఎన్నో ట్విస్టులు చోటుచేసుకున్నాయి .అయితే వివాహం తర్వాత మంచు మనోజ్ వైవాహిక జీవితాన్ని ఆనందంగానే గడుపుతున్నాడని క్లారిటీ వచ్చింది .