మొదలవ్వకుండానే ఇన్ని పుకార్లు... మొదలైన తర్వాత మరెన్ని పుకార్లో?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu ) హీరో గా జక్కన్న రాజమౌళి( Rajamouli ) దర్శకత్వం లో ఒక సినిమా రాబోతుందని విషయం తెలిసిందే.రెండు సంవత్సరాల నుండి ఈ సినిమా కు సంబంధించిన ప్రచారం జరుగుతోంది.

 Mahesh Babu And Rajamouli Movie Interesting Update Coming Soon , Hanuman,mahesh-TeluguStop.com

వచ్చే సంవత్సరం సినిమా యొక్క రెగ్యులర్ షూటింగ్ కార్యక్రమాలు మొదలయ్యే అవకాశం ఉంది.ఇప్పటికే ఈ సినిమా కు సంబంధించిన కథ రెడీ అయింది అంటూ విజయేంద్ర ప్రసాద్( Vijayendra Prasad ) సన్నిహితులు ఆఫ్ ది రికార్డు చెప్తున్నారు.

తాజాగా ఈ సినిమా హనుమాన్( Hanuman ) యొక్క కథ ఆధారంగా రూపొందిన కథ తో తెరకెక్కించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని చిత్ర యూనిట్ సభ్యుల్లో కొందరు మాట్లాడుకుంటున్నారు.

ఆ విషయమై ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత రాలేదు, కానీ మహేష్ బాబు ని మోడరన్ హనుమాన్ పాత్రలో చూపిస్తే ఎలా ఉంటుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.హనుమాన్ పాత్ర అంటే తోక, కోతి మూతి తో కాకుండా రెగ్యులర్ గానే ఉంటుందట.కాని కథ మాత్రం హనుమాన్ కథ కు పోలి ఉంటుందట.

ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియా లో ఆసక్తికరంగా చర్చ జరుగుతుంది.మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ సినిమా అంటే అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమా ఉండాలంటే ఎలాంటి అద్భుతమైన కథను ఎంపిక చేసుకుంటేనే బాగుంటుంది.

రాజమౌళి మరియు మహేష్ బాబు కాంబినేషన్ సినిమా ఇంకా అధికారికంగా ఎలాంటి స్పష్టత కానీ క్లారిటీ కానీ రాలేదు.అయినా కూడా ఇప్పటికే సినిమా గురించి ఎన్నో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.ఇక సినిమా మొదలైతే ఏ స్థాయిలో సినిమా గురించి పుకార్లు వస్తాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

హాలీవుడ్‌ ( Hollywood )రేంజ్ లో ఈ సినిమా ను రూపొందించడం తో పాటు మరో ఆస్కార్‌ ను దక్కించుకోవడమే లక్ష్యంగా రాజమౌళి సినిమా ను చేయబోతున్నాడట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube