Akkineni Naga Chaitanya : కస్టడీ సినిమా నుంచి మరో సాంగ్ రిలీజ్.. పోలీసుల కష్టాన్ని చెబుతూ భారీగా హైప్ పెంచేసారుగా?

టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య( Akkineni Naga Chaitanya ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.నాగచైతన్య ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

 Head Up High Lyrical From Custody-TeluguStop.com

గత ఏడాది అంటే సుందరానికి,బంగార్రాజు, లాంటి సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన నాగచైతన్య ప్రస్తుతం కస్టడీ సినిమా( Custody movie ) షూటింగ్లో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు.ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా తెలుగు తమిళం భాషల్లో మీ 12న విడుదల కావడానికి సిద్ధంగా ఉంది.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ పోస్టర్లకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది.

Telugu Akkineninaga, Kriti Shetty, Naga Chaitanya, Drop, Tollywood-Movie

ఇక ఇప్పటికే చిత్ర బృందం ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ని మొదలు పెట్టేశారు.ఈ క్రమంలోనే చిత్ర బృందం ఒకవైపు ప్రమోషన్స్ లో పాల్గొంటూనే మరోవైపు ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.కాగా నాగ చైతన్య ఈ కస్టడీ సినిమా పోలీస్ బ్యాక్ డ్రాప్ ( Police back drop )లో రూపొందిన విషయం తెలిసిందే.

Telugu Akkineninaga, Kriti Shetty, Naga Chaitanya, Drop, Tollywood-Movie

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమా నుంచి మొదటి లిరికల్ సాంగ్ ని పోలీసులకు డెడికేట్ చేస్తూ విడుదల చేశారు.హెడ్ అప్ హై అంటూ సాగే ఈ పాట ఆకట్టుకుంటోంది.పోలీసుల గురించి వాళ్లు పడే కష్టం గురించి ఈ పాటలో అద్భుతంగా తెలిపారు.అంతేకాకుండా తాము చేసే పనికి రోజా పూలు ఇచ్చి గుర్తించాల్సిన అవసరం లేదని వారి నుంచి వచ్చే అభినందనలే చాలు అని ఎంతో అద్భుతంగా చెప్పుకొచ్చారు.

Telugu Akkineninaga, Kriti Shetty, Naga Chaitanya, Drop, Tollywood-Movie

ఈ సినిమాలో శివ అనే కానిస్టేబుల్ పాత్రలో నాగచైతన్య నటించిన విషయం తెలిసిందే.ఈ సినిమాకు వెంకట ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు.ఈ సినిమాలో నాగచైతన్య సరసన కృతి శెట్టి ( Kriti Shetty )హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమాతో నాగచైతన్య ఏ మేరకు సక్సెస్ ను అందుకుంటారో చూడాలి మరి.ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అక్కినేని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube