వరుసగా ప్రశ్నాపత్రాల లీకేజ్( Leakage of question papers ) వ్యవహారాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కుదిపేస్తున్నాయి.TSPSC ప్రశ్నాపత్రం లీకేజ్ వ్యవహారంలో BRS మంత్రుల పాత్ర కూడా ఉన్నట్లు ప్రతిపక్షాలు విమర్శలు చేయడం జరిగాయి.
ఈ విషయం ఇంకా నడుస్తూ ఉండగా తెలంగాణ రాష్ట్రంలో పదవ తరగతి తెలుగు మరియు హిందీ పేపర్ వరుసగా లీక్ కావటం ఇప్పుడు సంచలనంగా మారింది.పదవ తరగతి పరీక్షల పేపర్ లీక్ ఘటనలు విద్యార్థులు మరియు తల్లిదండ్రులనీ ఆందోళనలోకి నెట్టేసాయి.
అయితే వరుసగా ప్రశ్న పత్రాల లీక్ ఘటనలపై తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ( PCC chief Revanth Reddy )సంచలన వ్యాఖ్యలు చేశారు.
కేసీఆర్ పాలన గాలికి వదిలేసి రాజకీయ విధ్వంసంలో మునగడంతో ప్రశ్నాపత్రం లీకులు…, పదవ తరగతి మొదలు- టీఎస్పీఎస్సీ వరకు వ్యవస్థలన్నీ కుప్పకూలాయి.లక్షల మంది విద్యార్థులు, నిరుద్యోగులతో చెలగాటమాడుతున్నాడు.కేసీఆర్( KCR ) కు ఒక్క క్షణం కూడా అధికారంలో కొనసాగే అర్హత లేదు.
ఇక పరీక్షలు కాదు… రాష్ట్ర ప్రభుత్వాన్నే రద్దు చేయాలి.అంటూ.
బైబై కేసీఆర్ అనే హ్యాష్ ట్యాగ్ పోస్ట్ పెట్టడం జరిగింది.రేవంత్ రెడ్డి లేటెస్ట్ పోస్ట్ తెలంగాణా రాజకీయాలలో సంచలనంగా మారింది.