అప్పుడప్పుడు సెలబ్రిటీలను బాగా టార్గెట్ చేస్తూ దారుణంగా కామెంట్లు చేస్తూ ఉంటారు నెటిజన్స్.ఎందుకో తెలియదు కానీ వాళ్ళు ఏదైనా పోస్ట్ షేర్ చేస్తే చాలు వెంటనే ఫైర్ అవుతూ ఉంటారు.
ఇప్పటికి చాలామంది సెలబ్రిటీలను నెగిటివ్ కామెంట్ల (Negative Comments)తో చాలామంది దూషించారు.తాజాగా యాంకర్ శ్యామల (Shyamala) పై కూడా ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు.
ఇంతకు అసలేం జరిగిందో తెలుసుకుందాం.
తెలుగు బుల్లితలపై యాంకర్ శ్యామల (Anchor Shyamala) తన పరిచయాన్ని పూర్తిగా పెంచుకుంది.
వెండితెరపై కూడా పలు సినిమాలలో అక్క, వదిన పాత్రలలో చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఇక ఈమె మరో బుల్లితెర నటుడు నరసింహారెడ్డి ( Narasimha Reddy) ని ప్రేమ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.
వీరికి ఒక కుమారుడు ఉన్నాడు.
చిన్న వయసులోనే బుల్లితెరలో అడుగు పెట్టి పలు సీరియల్ (Serials) లో నటించగా.ఆ తర్వాత వెండితెరపై అవకాశాలు అందుకుంది.ఇక పలు షోల్లో యాంకరింగ్ చేస్తూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.
కొన్ని అడ్వర్టైజ్మెంట్ లలో కూడా నటిస్తుంది.ఈమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగానే ఉందని చెప్పవచ్చు.
శ్యామల ఈమధ్య సోషల్ మీడియాలో (Social Media) బాగా యాక్టివ్ గా మారింది.
ప్రతి ఒక్క విషయాన్ని సోషల్ మీడియా వేదికగానే పంచుకుంటుంది.అప్పుడప్పుడు తన బాబు తో చేసిన వీడియోలను, వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటుంది.అంతే కాకుండా తన ఫాలోవర్స్ (Followers) తో ముచ్చట్లు కూడా పెడుతూ ఉంటుంది.
ఇక యూట్యూబ్ లో కూడా ఛానల్ క్రియేట్ చేసుకొని అందులో చాలా వీడియోలు పంచుకుంది.ముఖ్యంగా వంటలకు సంబంధించిన వీడియోల (Videos) ను బాగా చేస్తుంది.
అప్పుడప్పుడు కొన్ని టిప్స్ కూడా షేర్ చేసుకుంటుంది.తన ఫ్యామిలీతో కలిసి బయటికి వెళ్ళిన వీడియోలను.తన కొత్త ఇంటి వీడియోను కూడా హోమ్ టూర్ చేసి తన ఫాలోవర్స్ కి షేర్ చేసుకుంది.అయితే గత కొన్ని రోజుల నుండి శ్యామల మంచి ఫిజిక్ సొంతం చేసుకొని మంచి మంచి అవుట్ ఫిట్ (Outfit) లతో ఫోటోషూట్ చేయించుకొని వాటిని బాగా షేర్ చేస్తూ తెగ సందడి చేస్తుంది.
ఇక అప్పుడప్పుడు బాగా ట్రోల్స్ (Trolls) కూడా ఎదుర్కొంటూ ఉంటుంది.కానీ వాటిని అస్సలు పట్టించుకోదు.
అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో రెండు ఫోటోలు (Photos) పంచుకుంది.అందులో తన అందాలతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది.
తన ఫ్యాన్స్ తన ఫోటోకి బాగా లైక్స్ కూడా కొడుతున్నారు.కానీ ఓ నెటిజన్ మాత్రం దారుణంగా అవమానించారు.
ఏంటో ఈ దరిద్రం.లాస్ట్ కి ఇది కూడా సెలబ్రిటీల ఫీల్ అవుతుంది.
నువ్వు నీ ఎదవ మేకప్ మొహం తట్టుకోలేకపోతున్నాం అంటూ కామెంట్ చేయగా.వెంటనే ఈ కామెంట్ కు మిగతా నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు.
ప్రస్తుతం శ్యామల ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి.