టాలీవుడ్ స్టార్ హీరోలు ప్రస్తుతం పాన్ ఇండియా హీరోలు అయ్యారు.టాలీవుడ్ స్టార్ హీరోలలో దాదాపుగా ప్రతి హీరో 100 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకునే స్థాయికి ఎదిగారు.
అయితే టాలీవుడ్ హీరోలలో చాలామంది హీరోల బిరుదులు మారాయి.అభిమానులు సైతం తమ హీరోల కొత్త బిరుదుల విషయంలో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
అటు సీనియర్ హీరోలు ఇటు యంగ్ స్టార్ హీరోలు బిరుదుల మార్పుకు ప్రాధాన్యత ఇస్తున్నారు.
టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన రామ్ చరణ్( Ram Charan ) ను ప్రస్తుతం ఫ్యాన్స్ గ్లోబల్ స్టార్ గా పిలుచుకుంటున్నారు.
ప్రపంచవ్యాప్తంగా చరణ్ పేరు మారు మ్రోగుతుండటంతో పాటు చరణ్ బిజినెస్ ఊహించని స్థాయిలో పెరగడంతో చరణ్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.మరోవైపు స్టార్ హీరో బాలయ్యను ఫ్యాన్స్ ప్రేమగా గాడ్ ఆఫ్ మాసెస్ అని పిలుచుకుంటున్నారు.
ఈ బిరుదు అభిమానులకు ఎంతగానో నచ్చింది.
బాలయ్య త్వరలో బోయపాటి డైరెక్షన్ లో మరో సినిమాలో కనిపించనున్నారు.యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ను ఫ్యాన్స్ మ్యాన్ ఆఫ్ ది మాసెస్ అని పిలుచుకుంటుండగా మాస్ ప్రేక్షకుల్లో తారక్ స్థాయి ఫ్యాన్ ఫాలోయింగ్ మరే హీరోకు లేదనే సంగతి తెలిసిందే.అల్లు అర్జున్ స్టైలిష్ స్టార్ నుంచి తన బిరుదును ఐకాన్ స్టార్ గా మార్చుకున్న సంగతి తెలిసిందే.
నాగచైతన్యను ఫ్యాన్స్ యువసామ్రాట్ అని పిలుస్తున్నారు.
ప్రభాస్ ను కొన్ని నెలల క్రితం వరకు యంగ్ రెబల్ స్టార్ అని పిలవగా ప్రస్తుతం ప్రభాస్ బిరుదు రెబల్ స్టార్ గా మారింది.పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ గా, చిరంజీవి మెగాస్టార్, మహేష్ బాబు సూపర్ స్టార్ అనే బిరుదులను కొనసాగిస్తున్నారు.నాగార్జునకు మాత్రం ప్రస్తుతం కింగ్ అనే బిరుదు ఉంది.