తెలుగులో తక్కువ సినిమాలే చేసినా స్ట్రెయిట్ హీరోయిన్లతో సమానంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ను కలిగి ఉన్న హీరోయిన్లలో హనీ రోజ్( Honey Rose ) కూడా ఒకరు.వీరసింహారెడ్డి సినిమా సక్సెస్ తో తెలుగులో హనీ రోజ్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది.
తాజాగా హనీ రోజ్ హైదరాబాద్ లో జిస్మత్ మండీని ప్రారంభించారు.ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను ఆమె వెల్లడించారు.
వీరసింహారెడ్డి మూవీలోని రోల్ కు ఫ్యాన్స్ నుంచి ఇండస్ట్రీ నుంచి ప్రశంసలు దక్కాయని ఆమె అన్నారు.
బాలయ్యతో కలిసి నటించే ఛాన్స్ రావడంతో నా కల నిజమైందని ఆమె చెప్పుకొచ్చారు.నాకు సినిమాలు మినహా వేరే ప్రపంచం తెలియదని హనీరోజ్ చెప్పుకొచ్చారు.14 ఏళ్ల వయస్సులోనే తాను సినిమాల్లోకి వచ్చానని ఆమె కామెంట్లు చేశారు.వీరసింహారెడ్డి సినిమా కోసం నాకు కాల్ రావడంతో నేను ఆశ్చర్యపోయానని ఆమె అన్నారు. వీరసింహారెడ్డి( Veera Simha Reddy )లో రెండు రోల్స్ లో కనిపించడం అరుదైన అవకాశం అని హనీరోజ్ పేర్కొన్నారు.
వీరసింహారెడ్డి మూవీ కోసం చాలా కష్టపడ్డానని ఆమె చెప్పుకొచ్చారు.మూవీ షూట్ టైమ్ లో బాలయ్య( Balakrishna ) సలహాలు, సూచనలు ఇచ్చారని హనీరోజ్ పేర్కొన్నారు.బాలయ్యతో కలిసి నటించడం వల్ల కొత్త విషయాలు నేర్చుకున్నానని ఆమె చెప్పుకొచ్చారు.రొమాంటిక్ రోల్స్ చేయడం నాకు ఇష్టమని హనీరోజ్ అన్నారు.నా మీద ప్రేమ చూపిస్తున్న ఫ్యాన్స్ కు ధన్యవాదాలు అని ఆమె చెప్పుకొచ్చారు.
పెళ్లి అంటే బాధ్యత అని అందుకే ప్రతి అంశంతో ప్రేమలో ఉన్నానంటూ హనీ రోజ్ విచిత్రమైన కామెంట్స్ చేశారు.
టాలీవుడ్ హీరోలు హనీ రోజ్ కు సినిమా ఆఫర్లు ఇస్తారో లేదో చూడాల్సి ఉంది.సినిమా సినిమాకు హనీ రోజ్ కు డిమాండ్ పెరుగుతుండగా ఆమెను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య కూడా పెరుగుతోంది.