Ravanasura : రావణాసుర సినిమా నుంచి ఫాస్ట్ బీట్ సాంగ్ రిలీజ్.. రవితేజకు మరో హిట్ పడ్డట్టేనా?

తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.రవితేజ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

 Dikka Dishum Lyrical Video Song From Ravi Teja Ravanasura Movie-TeluguStop.com

సినిమా హిట్టు ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నాడు రవితేజ( Raviteja )ఈ నేపథ్యంలోనే ధమాకా సినిమాతో ప్రేక్షకులను ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.ప్రస్తుతం రవితేజ తన తదుపరి సినిమా అయినా రావణాసుర సినిమా( Ravanasura ) షూటింగ్లో భాగంగా బిజీబిజీగా ఉన్నారు.

డైరెక్టర్ సుధీర్ వర్మ( Sudheer Varma ) దర్శకత్వంలో అభిషేక్ పిక్చర్స్, ఆర్ టి టీమ్‌వర్క్స్‌పై రూపొందుతున్న ఎంగేజింగ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ రావణాసుర.ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయిన విషయం తెలిసింది.ఈ సాంగ్ ఇప్పటికే యూట్యూబ్ లో ట్రెండింగ్ లో దూసుకుపోయింది.ఇలా ఉంటే తాజాగా ఉగాది పండుగ సందర్భంగా ఈ సినిమా నుంచి మూడవ సాంగ్ ని విడుదల చేశారు మూవీ మేకర్స్.

డిక్కా.డిశుమ్ అంటూ సాగే ఫుల్ జోష్ సాంగ్ ను విడుదల చేశారు.

ఈ వీడియో సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్ లో ట్రెండింగ్ అవుతూ దూసుకుపోతోంది.కాగా ఈ సినిమాలో రవితేజ లాయర్ పాత్రలో కనిపించనున్నాడు.

ఇందులో అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్( Megha Akash ), ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్కర్, పూజిత పొన్నాడ తదితరులు నటిస్తున్నారు.కాగా ఈ రావణాసుర సినిమా ఏప్రిల్ 7, 2023న విడుదల కానుంది.కాగా క్రాక్ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ ని ప్రారంభించిన రవితేజ వరుసగా ఒకదాని తర్వాత ఒకటి హిట్ లను అందుకుంటూ దూసుకుపోతున్నాడు.చివరగా ధమాకా అలాగే వాల్తేరు వీరయ్య సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.

వాల్తేరు వీరయ్య సినిమాలో రవితేజ నటించిన మంచి మార్కులే పడ్డాయి.ప్రస్తుతం రవితేజ నటించిన బోయే మరికొన్ని ప్రాజెక్టులు చర్చలు దశలో ఉన్నట్లు కూడా తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube